This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jaya-Simha
Song » Ee Naati Ee haayi / ఈ నాటి ఈ హాయీ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 mOhana rAgaMlOni sammOhana SaktulanniMTinI poMduparucukunna pasaMdaina gItaM idi. svarakarta sRuShTiMcina mAdhuryAnni aMdajEyaTaMlO GaMTasAla, lIla sariyaina saMdhAnakartalugA vinabaDatAru. ika en.Ti.Ar, aMjalIdEvi aBinayiMcina 'InATi I hAyi' pATa viShayAniki vastE O tamAShA saMGaTana ceppAli. naMdamUri sOdarulu myUjik siTTiMgki vastunnAranagAnE vAritO sannihitaMgA uMDE Ti.vi.rAju gArikkUDA TenShangA uMDEdi, Ayana bRuMdaMtO sahA. 1968lO 'pAla manasulu' citraM dvArA paricayamai tarvAta tarvAta saMgIta darSakuDigA eMtO pEru saMpAdiMcukunna satyaM appaTlO A bRuMdaMlO uMDEvAru. DhOlak vAyiMcE vAru kanuka 'DhOlak satyaM' anEvArAyanni. hiMdI sinimA pATalaMTE cevi kOsukunE satyaM maMci pATalunna hiMdI sinimA viDudalayiMdani telistE rAtri aMdarU paDukunna tarvAta evarikI teliyakuMDA veLLi sekaMD ShO cUsEsi bassulu avI lEkapOtE kAlinaDakana vaccEsi, tirigi buddhimaMtuDilA paDukuMDipOyEvAru A bRuMdaMlO.


A rOju 'InATi I hAyi' pATaki saMbaMdhiMcina TyUn naMdamUri sOdarulaku vinipiMci tIrAli. EvEvO tayAru cESArugAnI evarikI tRuptigA lEdu. 1953 prAMtaMlO dil-e-nAdAn anE hiMdI citraM viDudalayiMdi. gulAm mahammad A citrAniki saMgIta darSakuDu. Ayana svaraparacagA talat mahammad pADina O pATa talat svarNOtsava vijayagItAllO okaTigA nilicipOyiMdi. A pATa pallavi ilA uMTuMdi.

jiMdagI dEnE vAlI sun - teri duniyAsE dil BargayA - mai yahA jI tehI margayA - jiMdagIdEnE vAlIsu

I pATani vinipiMci 'ilA cEddAmA?' ani aDigAru satyaM. 'vALLu kanipeTTalEranukunnavA? caMpEstAru jAgratta' ani heccariMcAru Ti.vi.rAju. 'adikAdaMDI cinna gammattu cEstA vinaMDi' aMTU 'jiMdagI dEnE vAlIsu' pATalOni reMDOlain ayina 'tErI duniyAsE dil Bar gayA' ki gala TyUnni  'InATi I hAyi' pATaki modaTi lainugA tIsukuni mOhanarAgAnni AlapiMcukuMTU 'kalakAdOyi nijamOyi' anE lainni pUrti cESAru satyaM. veMTanE pATa pUrti svarUpaM Ti.vi.rAjugAriki sAkShAtkariMpacEsiMdi. iMTar lUDs (caraNAlu madhya vaccE vAdya saMgItaM)tO sahA caraNAla TyUnunu siddhaM cEsESArAyana. mottaM pATa cakacakA tayArayipOyiMdi. PasT hiyariMglOnE OkE cEsESAru naMdamUri sOdarulu. eMta BayapaDDArO aMta suKaMgA, vijayavaMtaMgA A siTTiMg mugisinaMduku 'InATi I hAyi kalakAdOyi nijamOyi' ani pADukunnAraTa A rOju.
 
Important information - Telugu

మోహన రాగంలోని సమ్మోహన శక్తులన్నింటినీ పొందుపరుచుకున్న పసందైన గీతం ఇది. స్వరకర్త సృష్టించిన మాధుర్యాన్ని అందజేయటంలో ఘంటసాల, లీల సరియైన సంధానకర్తలుగా వినబడతారు. ఇక ఎన్.టి.ఆర్, అంజలీదేవి అభినయించిన 'ఈనాటి ఈ హాయి' పాట విషయానికి వస్తే ఓ తమాషా సంఘటన చెప్పాలి. నందమూరి సోదరులు మ్యూజిక్ సిట్టింగ్కి వస్తున్నారనగానే వారితో సన్నిహితంగా ఉండే టి.వి.రాజు గారిక్కూడా టెన్షన్గా ఉండేది, ఆయన బృందంతో సహా.

1968లో 'పాల మనసులు' చిత్రం ద్వారా పరిచయమై తర్వాత తర్వాత సంగీత దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న సత్యం అప్పట్లో ఆ బృందంలో ఉండేవారు. ఢోలక్ వాయించే వారు కనుక 'ఢోలక్ సత్యం' అనేవారాయన్ని. హిందీ సినిమా పాటలంటే చెవి కోసుకునే సత్యం మంచి పాటలున్న హిందీ సినిమా విడుదలయిందని తెలిస్తే రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా వెళ్ళి సెకండ్ షో చూసేసి బస్సులు అవీ లేకపోతే కాలినడకన వచ్చేసి, తిరిగి బుద్ధిమంతుడిలా పడుకుండిపోయేవారు ఆ బృందంలో.


ఆ రోజు 'ఈనాటి ఈ హాయి' పాటకి సంబంధించిన ట్యూన్ నందమూరి సోదరులకు వినిపించి తీరాలి. ఏవేవో తయారు చేశారుగానీ ఎవరికీ తృప్తిగా లేదు. 1953 ప్రాంతంలో దిల్-ఎ-నాదాన్ అనే హిందీ చిత్రం విడుదలయింది. గులామ్ మహమ్మద్ ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆయన స్వరపరచగా తలత్ మహమ్మద్ పాడిన ఓ పాట తలత్ స్వర్ణోత్సవ విజయగీతాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ పాట పల్లవి ఇలా ఉంటుంది.

జిందగీ దేనే వాలీ సున్ - తెరి దునియాసే దిల్ భర్గయా - మై యహా జీ తెహీ మర్గయా - జిందగీదేనే వాలీసు

ఈ పాటని వినిపించి 'ఇలా చేద్దామా?' అని అడిగారు సత్యం. 'వాళ్ళు కనిపెట్టలేరనుకున్నవా? చంపేస్తారు జాగ్రత్త' అని హెచ్చరించారు టి.వి.రాజు. 'అదికాదండీ చిన్న గమ్మత్తు చేస్తా వినండి' అంటూ 'జిందగీ దేనే వాలీసు' పాటలోని రెండోలైన్ అయిన 'తేరీ దునియాసే దిల్ భర్ గయా' కి గల ట్యూన్ని  'ఈనాటి ఈ హాయి' పాటకి మొదటి లైనుగా తీసుకుని మోహనరాగాన్ని ఆలపించుకుంటూ 'కలకాదోయి నిజమోయి' అనే లైన్ని పూర్తి చేశారు సత్యం.
 
వెంటనే పాట పూర్తి స్వరూపం టి.వి.రాజుగారికి సాక్షాత్కరింపచేసింది. ఇంటర్ లూడ్స్ (చరణాలు మధ్య వచ్చే వాద్య సంగీతం)తో సహా చరణాల ట్యూనును సిద్ధం చేసేశారాయన. మొత్తం పాట చకచకా తయారయిపోయింది. ఫస్ట్ హియరింగ్లోనే ఓకే చేసేశారు నందమూరి సోదరులు. ఎంత భయపడ్డారో అంత సుఖంగా, విజయవంతంగా ఆ సిట్టింగ్ ముగిసినందుకు 'ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి' అని పాడుకున్నారట ఆ రోజు.