This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Bratuku-theruvu
Song » Edo mattumandu / ఏదో మత్తుమందు
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English


I pATanu pi.lIla pADagA sAvitri aBinayiMcAru. akkinEni kUDA sannivESaMlO uMTAru. I pATaku racana samudrAla.(jUniyar, sIniyar pratyEkaMgA pErkonabaDalEdu) sAdhAraNaMgA sAkI, pallavi, caraNaM ilA pATalO uMTuMTAyi. kAnI toluta pallavi, A taruvAta caraNaM, A taruvAta sAkIla vale anipiMcE caraNAlu uMDaTaM I pATa pratyEkata. sAhityAnni paTTiMcukunE alavATunna vArini 'taritIpi ' anE prayOgaM AkarShistuMdI pATalO. tari aMTE gADhamaina, cikkani,dhRuDhamaina ani ardhAlunnAyi. I sinimAki saMgItaM si.Ar.subbarAman aMD GaMTasAla ani TaiTils lO uMTuMdi.

'aMdamE AnaMdaM' pATanu GaMTasAle svaraparacinaTTugA samudrAla jUniyar ceppina mATalani baTTi telustOMdi. kAsta jAgrattagA gamanistE "EdO mattumaMdu jalli" I pATanu kUDA GaMTasAlE svaraparacinaTTu manaki telisipOtuMdi. kAvAlaMTE I pATanu saMpAdiMci vinaMDi. kalavaramAye / palukE rAdAye anE vAkyAla daggara vaccE TyUn ni alA AlapiMcukuMTU  pOtE 'marmayOgi ' sinimAlOni 'navvula nadilo puvvula paDava kadilE' pATa daggara tEltAM. I pATaki kUDA saMgItaM GaMTasAlE .idE naDaka 'EdO mattu maMdu ' pATalO paina pErkonna vAkyAla daggara kanipistuMdi. gamaniMcaMDi.

I 'bratuku teruvu ' sinimalO gala pATalalO 'gAli mEDalA kUlE ASA' anE pATanu mAtraM subbarAman TyUn cEsi canipOyArani, migilina pATalannI GaMTasAlE TyUn cESArani Ayana satImaNi sAvitri gAru telipAru. I 'gAli mEDalA kUlE ASA' prasAdarAvu pADAraTa.   

 
Important information - Telugu

ఈ పాటను పి.లీల పాడగా సావిత్రి అభినయించారు. అక్కినేని కూడా సన్నివేశంలో ఉంటారు. ఈ పాటకు రచన సముద్రాల.(జూనియర్, సీనియర్ ప్రత్యేకంగా పేర్కొనబడలేదు) సాధారణంగా సాకీ, పల్లవి, చరణం ఇలా పాటలో ఉంటుంటాయి. కానీ తొలుత పల్లవి, ఆ తరువాత చరణం, ఆ తరువాత సాకీల వలె అనిపించే చరణాలు ఉండటం ఈ పాట ప్రత్యేకత. సాహిత్యాన్ని పట్టించుకునే అలవాటున్న వారిని 'తరితీపి ' అనే ప్రయోగం ఆకర్షిస్తుందీ పాటలో. తరి అంటే గాఢమైన, చిక్కని,ధృఢమైన అని అర్ధాలున్నాయి. ఈ సినిమాకి సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ అండ్ ఘంటసాల అని టైటిల్స్ లో ఉంటుంది. 'అందమే ఆనందం' పాటను ఘంటసాలె స్వరపరచినట్టుగా సముద్రాల జూనియర్ చెప్పిన మాటలని బట్టి తెలుస్తోంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే "ఏదో మత్తుమందు జల్లి" ఈ పాటను కూడా ఘంటసాలే స్వరపరచినట్టు మనకి తెలిసిపోతుంది. కావాలంటే ఈ పాటను సంపాదించి వినండి. కలవరమాయె / పలుకే రాదాయె అనే వాక్యాల దగ్గర వచ్చే ట్యూన్ ని అలా ఆలపించుకుంటూ  పోతే 'మర్మయోగి ' సినిమాలోని 'నవ్వుల నదిలొ పువ్వుల పడవ కదిలే' పాట దగ్గర తేల్తాం. ఈ పాటకి కూడా సంగీతం ఘంటసాలే .ఇదే నడక 'ఏదో మత్తు మందు ' పాటలో పైన పేర్కొన్న వాక్యాల దగ్గర కనిపిస్తుంది. గమనించండి.

ఈ 'బ్రతుకు తెరువు ' సినిమలో గల పాటలలో 'గాలి మేడలా కూలే ఆశా' అనే పాటను మాత్రం సుబ్బరామన్ ట్యూన్ చేసి చనిపోయారని, మిగిలిన పాటలన్నీ ఘంటసాలే ట్యూన్ చేశారని ఆయన సతీమణి సావిత్రి గారు తెలిపారు. ఈ 'గాలి మేడలా కూలే ఆశా' ప్రసాదరావు పాడారట.     
రాజా
డి.టి.పి. కర్టెసీ :
శ్రీమతి సునీత ఆకెళ్ళ