Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
'madi uyyAlalUgE' pATanu GaMTasAla, lIla gAnaM ceyyagA en.Ti.Ar, sAvitri aBinayiMcAru. I pATalO 'prEmatO gagana vIdhulalO' daggara, 'cinnatanamElA' daggara , 'O celiyA mana jIvitamaMtA' daggara GaMTasAla pADina paddhati viMTE anni sthAyillOnU gAtrAnni saMpUrNaMgA AviShkariMcaTaM aMTE EmiTO avagAhanaku vastuMdi. rEMjki taggaTTugA vAyisni malacukOvaDaM telustuMdi. idi ilA uMDagA I pATalO lIla pADina vidhAnAnni jAgrattagA gamanistE - 'madi uyyAlalUgE nava BAvAlEvO rEgE mAnasa mAnaMda mAyenahO' ani anipiMci pallavi anuBavaMlOki vastuMdi. 'prEmalO karigipOvudamA - BEdamE maracipOvudamA' lainla daggara lObEs lO Ame iccina perPArmensE aMduku tirugulEni sAkShyaM.
ika saMgIta darSakuDigA rAjESvararAvu mudrani pallavilOnu caraNAlalOnU paTTukOvaDaM kasTaM. vesTran kArDs tO kUDina iMTar lUDs viMTE taruvAta rOjullO Ayana cEsina - 'nIkO tODu kAvAli nAkO nIDa kAvAli ' (caduvukunna ammAyilu), 'egurucunnadi yavvanamU' (dorikitE doMgalu) - pATalu gurtuku vastAyi. biLahari, kamAs rAgAla AdhAraMgA I pATa svaraparacabaDiMdi. sAhityaparaMgA cUsukuMTE kavulaku gauravaM iccE rOjulu kAbaTTi 'punvi vennela' anE padAlni yathAtathaMgA uMcAru. I rOjullO ayitE 'porapATuna guDi peTTaDaM marcipOyi uMTAru' ani nirthAriMcEsukuni evariki vArE kavulaipOyi 'punnami vennela' ani diddEstArani vErE ceppanavasaraM lEdu kadA!?
'మది ఉయ్యాలలూగే' పాటను ఘంటసాల, లీల గానం చెయ్యగా ఎన్.టి.ఆర్, సావిత్రి అభినయించారు. ఈ పాటలో 'ప్రేమతో గగన వీధులలో' దగ్గర, 'చిన్నతనమేలా' దగ్గర , 'ఓ చెలియా మన జీవితమంతా' దగ్గర ఘంటసాల పాడిన పద్ధతి వింటే అన్ని స్థాయిల్లోనూ గాత్రాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించటం అంటే ఏమిటో అవగాహనకు వస్తుంది. రేంజ్కి తగ్గట్టుగా వాయిస్ని మలచుకోవడం తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ పాటలో లీల పాడిన విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే - 'మది ఉయ్యాలలూగే నవ భావాలేవో రేగే మానస మానంద మాయెనహో' అని అనిపించి పల్లవి అనుభవంలోకి వస్తుంది. 'ప్రేమలో కరిగిపోవుదమా - భేదమే మరచిపోవుదమా' లైన్ల దగ్గర లోబేస్ లో ఆమె ఇచ్చిన పెర్ఫార్మెన్సే అందుకు తిరుగులేని సాక్ష్యం.
ఇక సంగీత దర్శకుడిగా రాజేశ్వరరావు ముద్రని పల్లవిలోను చరణాలలోనూ పట్టుకోవడం కస్టం. వెస్ట్రన్ కార్డ్స్ తో కూడిన ఇంటర్ లూడ్స్ వింటే తరువాత రోజుల్లో ఆయన చేసిన - 'నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి ' (చదువుకున్న అమ్మాయిలు), 'ఎగురుచున్నది యవ్వనమూ' (దొరికితే దొంగలు) - పాటలు గుర్తుకు వస్తాయి. బిళహరి, కమాస్ రాగాల ఆధారంగా ఈ పాట స్వరపరచబడింది. సాహిత్యపరంగా చూసుకుంటే కవులకు గౌరవం ఇచ్చే రోజులు కాబట్టి 'పున్వి వెన్నెల' అనే పదాల్ని యథాతథంగా ఉంచారు. ఈ రోజుల్లో అయితే 'పొరపాటున గుడి పెట్టడం మర్చిపోయి ఉంటారు' అని నిర్థారించేసుకుని ఎవరికి వారే కవులైపోయి 'పున్నమి వెన్నెల' అని దిద్దేస్తారని వేరే చెప్పనవసరం లేదు కదా!?