Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,
Actress : Girija / గిరిజ , Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu em.el. vasaMtakumAri, pi.lIla pADagA sAvitri, girija, rElaMgipai citrIkariMcAru. SAstrIya saMgIta kaccErIla sthAyilO sinIgItAlanu kUDA svaraparaci pradarSiMcavaccunanE nammakAnni kaligiMcE pATa idi. eM.el. vasaMta kumAri vaMTi SAstrIya saMgIta vidvAMsurAlitO pADiMcukunnadi kUDA aMdukE! I pATanu svarAlatO sahA tappulu dorlakuMDA pADi meppiMcagala gAyanI gAyakulevarikainA sarE E pATainA paTTupaDitIrutuMdi. telugu sinI gItAllO tarAla tarabaDi nilicipOyE ati goppa gItamidi. I pATa pallavi, caraNAlu, civari svarAlanu - mOhanarAgaMlOnU, madhyana vaccE svarAlanu - ShaNmuKapriya, kAMBOji, madhyamAvati rAgAlatOnU rUpoMdiMcAru. susvara saMgItAniki cevi yoggi vinE prativAriMTA uMDadagga gItamidi.
ఈ పాటను ఎమ్.ఎల్. వసంతకుమారి, పి.లీల పాడగా సావిత్రి, గిరిజ, రేలంగిపై చిత్రీకరించారు. శాస్త్రీయ సంగీత కచ్చేరీల స్థాయిలో సినీగీతాలను కూడా స్వరపరచి ప్రదర్శించవచ్చుననే నమ్మకాన్ని కలిగించే పాట ఇది. ఎం.ఎల్. వసంత కుమారి వంటి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలితో పాడించుకున్నది కూడా అందుకే! ఈ పాటను స్వరాలతో సహా తప్పులు దొర్లకుండా పాడి మెప్పించగల గాయనీ గాయకులెవరికైనా సరే ఏ పాటైనా పట్టుపడితీరుతుంది. తెలుగు సినీ గీతాల్లో తరాల తరబడి నిలిచిపోయే అతి గొప్ప గీతమిది. ఈ పాట పల్లవి, చరణాలు, చివరి స్వరాలను - మోహనరాగంలోనూ, మధ్యన వచ్చే స్వరాలను - షణ్ముఖప్రియ, కాంభోజి, మధ్యమావతి రాగాలతోనూ రూపొందించారు. సుస్వర సంగీతానికి చెవి యొగ్గి వినే ప్రతివారింటా ఉండదగ్గ గీతమిది.