Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
I Siva tAMDava stOtrAnni GaMTasAla gAnaM cEyagA en.Ti.Ar pradhAna pAtradhArigA aBinayiMcAru. prAmANika vRuttaMtO sAgina I stOtraM rAvaNakRutamani, kAnI tagina AdhArAlu lEvani, anUcAnaMgA vastunnadani ceppukuMTAru. haMsadhvani rAgaMtO modalaina I stOtraMlO 'agarva sarva maMgaLA kaLAkadaMba maMjarIm' nuMci 'OM namaHharAya' varakU valaji rAgaMlOnU 'prapulla nIla paMkajA' daggara nuMci 'tamaMta KaCcitam BajE' varakU mOhanarAgaMlOnU svaraparicAru. sinIgAyakulalO GaMTasAla vaMTi adRuShTavaMtuDu vErokaru lErani ceppAli. janmacaritArthamayyE svararacanalennO Ayanaku tana saMgIta jIvana yAnaMlO laBiMcAyi. A avakASAlanniTinI sadviniyOgaM cEsukOvaDamE kAka avi viMTE tAnu gAni, naTiMcina naTuDugAni SrOtala madilO medilETaMta paTiShTamaina mudranu ErparacukOgaligArAyana.
ఈ శివ తాండవ స్తోత్రాన్ని ఘంటసాల గానం చేయగా ఎన్.టి.ఆర్ ప్రధాన పాత్రధారిగా అభినయించారు. ప్రామాణిక వృత్తంతో సాగిన ఈ స్తోత్రం రావణకృతమని, కానీ తగిన ఆధారాలు లేవని, అనూచానంగా వస్తున్నదని చెప్పుకుంటారు. హంసధ్వని రాగంతో మొదలైన ఈ స్తోత్రంలో 'అగర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీమ్' నుంచి 'ఓం నమఃహరాయ' వరకూ వలజి రాగంలోనూ 'ప్రపుల్ల నీల పంకజా' దగ్గర నుంచి 'తమంత ఖఛ్చితమ్ భజే' వరకూ మోహనరాగంలోనూ స్వరపరిచారు. సినీగాయకులలో ఘంటసాల వంటి అదృష్టవంతుడు వేరొకరు లేరని చెప్పాలి. జన్మచరితార్థమయ్యే స్వరరచనలెన్నో ఆయనకు తన సంగీత జీవన యానంలో లభించాయి. ఆ అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకోవడమే కాక అవి వింటే తాను గాని, నటించిన నటుడుగాని శ్రోతల మదిలో మెదిలేటంత పటిష్టమైన ముద్రను ఏర్పరచుకోగలిగారాయన.