అలనాటి  అందాల, ప్రముఖ నటి వైజయంతి మాలకి తెలుగు తెలుసునని, తెలుగు బాగా  మాట్లాడగలరని నేటి తరానికే కాదు , నాటి తరం వారికి కూడా తెలియదు. హిందీలో  మధుమతి, నయాదౌర్, సంగమ్, లీడర్, అమ్రపాలి వంటి చిత్రాలకు ముందే తెలుగులో  సంఘం, జీవితం చిత్రాలలో నటించారామె. ఆమె బాగా పాడగలదు కూడా. ఇప్పటికీ  త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొంటూ తన వంతుగా తన గొంతును కలిపి పాడతారామె.  ఆవిడ తన తొలి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు దగ్గర లలిత  సంగీతాన్ని నేర్చుకునేవారు. అప్పట్లో ఆవిడ పాడిన రెండు లలిత సంగీత గీతాలు  ప్రైవేట్ రికార్డ్ లు గా విడుదలయ్యాయి. అందులోని ఒక పాటే ఇది.