Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి , Vyjayanthimala / వైజయంతిమాల ,
Music Director : Sudarshanam / సుదర్శనం ,
Lyrics Writer : Tholeti / తోలేటి ,
Singer : Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,
Song Category : Others
Song- Ragam :
I pATanu piThApuraM nAgESvararAvu pADagA yas.bAlacaMdar aBinayiMcAru. sannivESaparaMgA en.Ti.Ar. kUDA civarna pAlgoMTAru. piThApuraM nAgESvararAvuki laiP Taim sAMg idi. I pATanu pADakuMDA gAni, prastAviMcakuMDAgAni Ayana baiTaki rAlEdu. aMtEkAdu - A rOjullO I pATanu veyyani peLLipaMdiri AMdhradESaMlO lEdu gAka lEdaMTE aMdulO AvagiMjaMta atiSayOkti kUDA lEdu. ennisArlu vinnA enni tarAla tarvAta vinnA okErakaM rasasparSani kaligiMcE gItAlu konnE uMTAyi. huShAru gItAla viShayAnikostE aBiruci mAripOtU uMTuMdi kUDA! I pATa mAtraM O minahAyiMpu. eppuDainA vinaMDi... adE Upu adE huShAru kaligi tIrutuMdi.
I pATaku kosamerupu EmiTaMTE - I pATalO muKyapAtradhArigA aBiyiMcina yas.bAlacaMdar tana tarvAta jIvitaMlO prasiddha vaiNikuDigA mAraDaM! Ayana vINA vAdananu vinnavAru - Ayana kaccErIlaku hAjarayinavAru - venakki tirigi 'saMGaM' citraMlO Ayana cEsina pAtra pOShaNaku, I 'peLLi' pATaku aBinayiMcina tIruki - okiMta AScaryAniki, mariMta AnaMdAniki, ravaMta AragiMcukOlEni tanAniki lOnavaDaM sahajaM.
ఈ పాటను పిఠాపురం నాగేశ్వరరావు పాడగా యస్.బాలచందర్ అభినయించారు. సన్నివేశపరంగా ఎన్.టి.ఆర్. కూడా చివర్న పాల్గొంటారు. పిఠాపురం నాగేశ్వరరావుకి లైఫ్ టైమ్ సాంగ్ ఇది. ఈ పాటను పాడకుండా గాని, ప్రస్తావించకుండాగాని ఆయన బైటకి రాలేదు. అంతేకాదు - ఆ రోజుల్లో ఈ పాటను వెయ్యని పెళ్ళిపందిరి ఆంధ్రదేశంలో లేదు గాక లేదంటే అందులో ఆవగింజంత అతిశయోక్తి కూడా లేదు. ఎన్నిసార్లు విన్నా ఎన్ని తరాల తర్వాత విన్నా ఒకేరకం రసస్పర్శని కలిగించే గీతాలు కొన్నే ఉంటాయి. హుషారు గీతాల విషయానికొస్తే అభిరుచి మారిపోతూ ఉంటుంది కూడా! ఈ పాట మాత్రం ఓ మినహాయింపు. ఎప్పుడైనా వినండి... అదే ఊపు అదే హుషారు కలిగి తీరుతుంది.
ఈ పాటకు కొసమెరుపు ఏమిటంటే - ఈ పాటలో ముఖ్యపాత్రధారిగా అభియించిన యస్.బాలచందర్ తన తర్వాత జీవితంలో ప్రసిద్ధ వైణికుడిగా మారడం! ఆయన వీణా వాదనను విన్నవారు - ఆయన కచ్చేరీలకు హాజరయినవారు - వెనక్కి తిరిగి 'సంఘం' చిత్రంలో ఆయన చేసిన పాత్ర పోషణకు, ఈ 'పెళ్ళి' పాటకు అభినయించిన తీరుకి - ఒకింత ఆశ్చర్యానికి, మరింత ఆనందానికి, రవంత ఆరగించుకోలేని తనానికి లోనవడం సహజం.