Actor :
Actress :
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu suSIla gAnaM cESAru. terapai en.Ti.Ar, aMjalipai citrIkariMcAru. I pATanu kosarAju rAGavayya caudari rAsinaTTugA pATala pustakaMlO uMdi. maMci aBirucitO rUpudiddukunnA, maruguna paDipOyina madhura gItAlalO okaTigA I pATanu udahariMcavaccu. I pATa dorikE avakASAlu kUDA aMtaMta mAtramE. laByamaitE mAtraM O cakkaTi kalakShangA dAcukOdagga I pATa mOhanarAgaM AdhAraMgA sAgutuMdi. mOhanarAgaMlO rAjESvararAvu SrOtalaku samarpiMcina pATalennO... 'kaLLu teraci kanarA' (rAju - pEda), 'ecaTa nuMDi vIcenO I callani gAli' (appu cEsi pappu kUDu), 'pADavEla rAdhikA' (iddaru mitrulu), 'vinipiMcani rAgalE' (caduvukunna ammAyilu), 'madilO vINalu mrOgE' (AtmIyulu) ivannI mOhana rAgaM pradhAna rAgaMgA Ayana svararacanalO sAginavE.
ఈ పాటను సుశీల గానం చేశారు. తెరపై ఎన్.టి.ఆర్, అంజలిపై చిత్రీకరించారు. ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి రాసినట్టుగా పాటల పుస్తకంలో ఉంది. మంచి అభిరుచితో రూపుదిద్దుకున్నా, మరుగున పడిపోయిన మధుర గీతాలలో ఒకటిగా ఈ పాటను ఉదహరించవచ్చు. ఈ పాట దొరికే అవకాశాలు కూడా అంతంత మాత్రమే. లభ్యమైతే మాత్రం ఓ చక్కటి కలక్షన్గా దాచుకోదగ్గ ఈ పాట మోహనరాగం ఆధారంగా సాగుతుంది. మోహనరాగంలో రాజేశ్వరరావు శ్రోతలకు సమర్పించిన పాటలెన్నో... 'కళ్ళు తెరచి కనరా' (రాజు - పేద), 'ఎచట నుండి వీచెనో ఈ చల్లని గాలి' (అప్పు చేసి పప్పు కూడు), 'పాడవేల రాధికా' (ఇద్దరు మిత్రులు), 'వినిపించని రాగలే' (చదువుకున్న అమ్మాయిలు), 'మదిలో వీణలు మ్రోగే' (ఆత్మీయులు) ఇవన్నీ మోహన రాగం ప్రధాన రాగంగా ఆయన స్వరరచనలో సాగినవే.