Actor :
Actress :
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ , P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.suSIla, pi.bi.SrInivAs gAnaM cEyagA aMjalIdEvi, en.Ti.rAmArAvu aBinayiMcAru. I pATaku amIr kaLyANi rAgaM AdhAraM. idE rAgaMlO yas.rAjESvararAvu svaraparacina 'BaktajayadEva' citraMlOni 'nI madhu muraLI gAnalIla' pATa sinI saMgIta priyulaku GaMTasAla ArAdhakulaku bAgA gurtuMDE uMTuMdi. A pATanu, I pATanu saMpAdiMci, kalipi vinaMDi, AlApanalu, iMTarlUDlu eMta daggaragA unnAyO telustuMdi. sariyaina pracAraM laBiMcaka kAlagarBaMlO kalisi pO(bO)tunna maMci pATalalO idokaTi. E CAnal vArayinA pUnukuni I pATanu varasagA konnALLapATu prEkShaka SrOtalaku aMdistE - cakkani aBiruci gala vAri mannanaku pAtrulavutAru. Arudra rAsina I pATalO 'I rEyi - tIrEyi' anE pada prayOgaM Ayananu paTTi iccE mudra.
ఈ పాటను పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ గానం చేయగా అంజలీదేవి, ఎన్.టి.రామారావు అభినయించారు. ఈ పాటకు అమీర్ కళ్యాణి రాగం ఆధారం. ఇదే రాగంలో యస్.రాజేశ్వరరావు స్వరపరచిన 'భక్తజయదేవ' చిత్రంలోని 'నీ మధు మురళీ గానలీల' పాట సినీ సంగీత ప్రియులకు ఘంటసాల ఆరాధకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆ పాటను, ఈ పాటను సంపాదించి, కలిపి వినండి, ఆలాపనలు, ఇంటర్లూడ్లు ఎంత దగ్గరగా ఉన్నాయో తెలుస్తుంది. సరియైన ప్రచారం లభించక కాలగర్భంలో కలిసి పో(బో)తున్న మంచి పాటలలో ఇదొకటి. ఏ ఛానల్ వారయినా పూనుకుని ఈ పాటను వరసగా కొన్నాళ్ళపాటు ప్రేక్షక శ్రోతలకు అందిస్తే - చక్కని అభిరుచి గల వారి మన్ననకు పాత్రులవుతారు. ఆరుద్ర రాసిన ఈ పాటలో 'ఈ రేయి - తీరేయి' అనే పద ప్రయోగం ఆయనను పట్టి ఇచ్చే ముద్ర.