Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Shavukaru Janaki / షావుకారు జానకి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Inspiring & Motivational Songs
Song- Ragam :
I pATanu jikki pADagA ShAvukAru jAnaki aBinayiMciMdi. sannivESa prAdhAnyaMgA en.Ti.Ar kanipistAru. pATanu AsAMtaM okaTi reMDusArlu gamanistE - ivALa kaunsiliMgs pEriTa vastunna vyAsAlu, kOciMglu, praSnalu - samAdhAnAlu vITanniTi sArAMSaM - I pATa sAhityaMlO kanipistuMdi. I pATa racana kosarAju. ika saMgItaparaMgA ceppukOvAlaMTE A rOjullO janaM nOTa bAgA naligina pATa idi.
I pATa TyUnnu bAgA vaMTa paTTiMcukuni - taruvAta rOjullO viDudalaina ripablik proDakShans vAri 'peLLi saMdaDi' (1959) sinimAlOni 'appaTiki ippaTiki eMtO tEDA adi telisi masalukO bastI cinnODA' anE pATatO pOlci cUsukuMTE pOlikalu CAyAmAtraMgA kanipistAyi. I citrAniki kUDA saMgItaM GaMTasAlE kanuka alA uMDaTaM asahajaM kAdu.
ఈ పాటను జిక్కి పాడగా షావుకారు జానకి అభినయించింది. సన్నివేశ ప్రాధాన్యంగా ఎన్.టి.ఆర్ కనిపిస్తారు. పాటను ఆసాంతం ఒకటి రెండుసార్లు గమనిస్తే - ఇవాళ కౌన్సిలింగ్స్ పేరిట వస్తున్న వ్యాసాలు, కోచింగ్లు, ప్రశ్నలు - సమాధానాలు వీటన్నిటి సారాంశం - ఈ పాట సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ పాట రచన కొసరాజు. ఇక సంగీతపరంగా చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో జనం నోట బాగా నలిగిన పాట ఇది.
ఈ పాట ట్యూన్ను బాగా వంట పట్టించుకుని - తరువాత రోజుల్లో విడుదలైన రిపబ్లిక్ ప్రొడక్షన్స్ వారి 'పెళ్ళి సందడి' (1959) సినిమాలోని 'అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా' అనే పాటతో పోల్చి చూసుకుంటే పోలికలు ఛాయామాత్రంగా కనిపిస్తాయి. ఈ చిత్రానికి కూడా సంగీతం ఘంటసాలే కనుక అలా ఉండటం అసహజం కాదు.