Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Jamuna / జమున ,
Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ramana / రమణ ,
Song Category : Others
Song- Ragam :
sinimAlOni katha prakAraM - EnugutO tokkiMcaDAniki vIlugA tenAli rAmakRuShNuni rAjaBaTulu gOtilO kaMThaM varaku pAtipeTTi Enugunu tIsukurAvaTAniki veLatAru. A samayaMlO tenAli rAmakRuShNuniki rAyalavAripai jarugutunna kuTra telustuMdi. elA tappiMcukuni veLadAmA ani AlOcistuMDagA gUni kaligina O rajakuDu pADukuMTU aTu vastADu. ataDini buTTalO paDEsi tana sthAnaMlO ataDini kappipeTTi baiTapaDatADu tenAli rAmakRuShNuDu.
I sannivESaMlO rajakuDigA naTiMcina hAsyanaTuDu rAmakOTi I pATanu pADAru. eMcukunna vastuvuku anuguNaMgA gala aMSAlanu aMdamaina mATalatO arthamayyElA ceppagalagaTamE sinI kaviki uMDavalasina muKya lakShaNaM. tana kalAniki E vaipainA padunE ani telisE vidhaMgA rAsina sIniyar samudrAla cAturyaM pATanu okaTi reMDusArlu gamanistE arthamavutuMdi.
సినిమాలోని కథ ప్రకారం - ఏనుగుతో తొక్కించడానికి వీలుగా తెనాలి రామకృష్ణుని రాజభటులు గోతిలో కంఠం వరకు పాతిపెట్టి ఏనుగును తీసుకురావటానికి వెళతారు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణునికి రాయలవారిపై జరుగుతున్న కుట్ర తెలుస్తుంది. ఎలా తప్పించుకుని వెళదామా అని ఆలోచిస్తుండగా గూని కలిగిన ఓ రజకుడు పాడుకుంటూ అటు వస్తాడు. అతడిని బుట్టలో పడేసి తన స్థానంలో అతడిని కప్పిపెట్టి బైటపడతాడు తెనాలి రామకృష్ణుడు.
ఈ సన్నివేశంలో రజకుడిగా నటించిన హాస్యనటుడు రామకోటి ఈ పాటను పాడారు. ఎంచుకున్న వస్తువుకు అనుగుణంగా గల అంశాలను అందమైన మాటలతో అర్థమయ్యేలా చెప్పగలగటమే సినీ కవికి ఉండవలసిన ముఖ్య లక్షణం. తన కలానికి ఏ వైపైనా పదునే అని తెలిసే విధంగా రాసిన సీనియర్ సముద్రాల చాతుర్యం పాటను ఒకటి రెండుసార్లు గమనిస్తే అర్థమవుతుంది.