Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.lIla pADagA raMBa pAtranu aBinayiMcina nATyatAra kucalakumAri nartiMciMdi. sannivESa prAdhAnyaMgA en.Ti.Ar. kUDA kanipistADu. SAstrabaddhamaina kaLyANi rAgAniki I pATa O cakkani udAharaNa. I pATanu iMTar lUDstO sahA gurtuMcukO galigina vAriki kaLyANi rAgaM mIda maMci avagAhana, paTTu laBiMcE avakASaM cAlAvuMdi. 'maijigi' (SarIrakAMti) vaMTi pada prayOgAlanu gamaniMcaDaM I taraM vAriki cAlA avasaraM. okavidhaMgA ceppAlaMTE alanATi paurANika citrAlalOni pATala sAhityAnni pratipadArtha tAtparya sahitaMgA pUrvAparAlatO sahA oMTapaTTiMcukunETTu manaM ceyyakapOvaTaM vallanE ivALTi yuvataku telugu BASha guriMci iMta mottukOvAlsina AgatyaM ErpaDutuMdEmOnanipistuMdi.
ఈ పాటను పి.లీల పాడగా రంభ పాత్రను అభినయించిన నాట్యతార కుచలకుమారి నర్తించింది. సన్నివేశ ప్రాధాన్యంగా ఎన్.టి.ఆర్. కూడా కనిపిస్తాడు. శాస్త్రబద్ధమైన కళ్యాణి రాగానికి ఈ పాట ఓ చక్కని ఉదాహరణ. ఈ పాటను ఇంటర్ లూడ్స్తో సహా గుర్తుంచుకో గలిగిన వారికి కళ్యాణి రాగం మీద మంచి అవగాహన, పట్టు లభించే అవకాశం చాలావుంది. 'మైజిగి' (శరీరకాంతి) వంటి పద ప్రయోగాలను గమనించడం ఈ తరం వారికి చాలా అవసరం. ఒకవిధంగా చెప్పాలంటే అలనాటి పౌరాణిక చిత్రాలలోని పాటల సాహిత్యాన్ని ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా పూర్వాపరాలతో సహా ఒంటపట్టించుకునేట్టు మనం చెయ్యకపోవటం వల్లనే ఇవాళ్టి యువతకు తెలుగు భాష గురించి ఇంత మొత్తుకోవాల్సిన ఆగత్యం ఏర్పడుతుందేమోననిపిస్తుంది.