Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer :
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
'kanyASulkaM' katha palleTUri vAtAvaraNaMlO ekkuvagA jarugutuMdi kanuka pallepaTTu prAMtaMlO taracu vinipiMcE rAgaM ayitE bAvuMTuMdanna AlOcana I pATa svararacanalO kanipistuMdi. sAdhAraNaMgA palle prAMtAla gItAllOnU tattva gItAlalOnU hari kAMBOji rAgAnni, yadukula kAMBOji rAgAnni upayOgiMcaDaM jarugutU uMTuMdi. I pATaku saMbaMdhiMci yadukula kAMBOji rAgacCAyalE ekkuvagA unnAyani ceppoccu. I rAgAnni dhOraNilO GaMTasAla taruvAti rOjullO cAlAsArlu upayOgiMcAru.
'కన్యాశుల్కం' కథ పల్లెటూరి వాతావరణంలో ఎక్కువగా జరుగుతుంది కనుక పల్లెపట్టు ప్రాంతంలో తరచు వినిపించే రాగం అయితే బావుంటుందన్న ఆలోచన ఈ పాట స్వరరచనలో కనిపిస్తుంది. సాధారణంగా పల్లె ప్రాంతాల గీతాల్లోనూ తత్త్వ గీతాలలోనూ హరి కాంభోజి రాగాన్ని, యదుకుల కాంభోజి రాగాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పాటకు సంబంధించి యదుకుల కాంభోజి రాగచ్ఛాయలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రాగాన్ని ధోరణిలో ఘంటసాల తరువాతి రోజుల్లో చాలాసార్లు ఉపయోగించారు.
మాయాబజార్ (1957) చిత్రంలో 'దయచేయండి దయచేయండి' పాటని, 'జయం మనదే' (1956) చిత్రంలో 'చిలకన్న చిలకవే బంగారు చిలకవే' పాటని, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని ఆలపించుకోండి - ఆ తరువాత ఆ పాటల ఎత్తుగడ, ఈ పాట ప్రారంభం అవటానికి ముందు వచ్చే వా్య ప్రవేశం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేకపోయినా కొన్నిటిని పునశ్చరణ చేసుకుంటే మన సంస్కారం మరింత మెరుగుపడుతుంది.