Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,
Singer : Ghantasala / ఘంటసాల , Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu sadASiva brahmaM rAyagA GaMTasAla, lIla pADagA en.Ti.Ar, aMjalIdEvi aBinayiMcAru. pratinAyaka pAtradhAri Ar. nAgESvararAvu kUDA sannivESa prAdhAnyaMgA kanipistAru. pratinAyaka pAtradhArini ATapaTTistU hIrO hIrOyinlu rakarakAla vinyAsAlu cEstU saradAgA sAgE pATa idi. mAruvEShAlu vEsETappuDu en.Ti.Ar tanadaina bANIlO aBinayiMcE tIruni I pATalO ivALa ganaka cUstE A taraM prEkShakula pedavula mIda O cirudarahAsaM toMgicUDaDaM KAyaM.
ఈ పాటను సదాశివ బ్రహ్మం రాయగా ఘంటసాల, లీల పాడగా ఎన్.టి.ఆర్, అంజలీదేవి అభినయించారు. ప్రతినాయక పాత్రధారి ఆర్. నాగేశ్వరరావు కూడా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. ప్రతినాయక పాత్రధారిని ఆటపట్టిస్తూ హీరో హీరోయిన్లు రకరకాల విన్యాసాలు చేస్తూ సరదాగా సాగే పాట ఇది. మారువేషాలు వేసేటప్పుడు ఎన్.టి.ఆర్ తనదైన బాణీలో అభినయించే తీరుని ఈ పాటలో ఇవాళ గనక చూస్తే ఆ తరం ప్రేక్షకుల పెదవుల మీద ఓ చిరుదరహాసం తొంగిచూడడం ఖాయం.
ఘంటసాల గళంలో ఓ చక్కటి నటుడూ ఉన్నాడు. అతడు పాత్రవైఖరిని పాత్రధారి స్వభావాన్ని ఈ రెండిటి పోకడను సమన్వయ పరచుకుంటూ పాడే తత్వం అంతర్లీనంగా ఉన్న గాయకుడు కనుక ఆయన పాడిన పాటలో ఎక్స్ప్రెషన్లు కొన్ని - పాత్రధారులకి సహాయపడిపోతూ ఉంటాయి. ఈ పాటలో - 'ఇలా ఇలారాయే' అని అంటూ 'ఇలగిలగిలరాయే' అని ఆయన పలకటం కామెడిపరంగా బాగా వర్కవుట్ అయింది. దురదృష్టం ఏమిటంటే హె.ఎం.వి వారు తీసుకొచ్చిన 'చిరంజీవులు - జయం మనదే' కాంబినేషన్ క్యాసెట్లో ఈ పాటను తొలిగించటం జరిగింది. ఏదైనా ఛానల్లో ఈ సినిమా ప్రసారం అయినప్పుడు చూడాల్సిందే.