Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,
Actress : Suryakantham / సూర్యకాంతం ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు , Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) , P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.bi.SrInivAs, jikki pADagA rElaMgi, sUryakaLa hAsyanaTuDu bAlakRuShNapai citrIkariMcAru. pi.bi.SrInivAs, jikkitO pATu bAlakRuShNaku plEbyAk pADina vAri pEru TaiTils lO gAni, kyAseT inlai kavar pai gAni ekkaDA pErkoDaM jaragalEdu. I pATaku madhyamAvati rAgaM AdhAraM. 'nisarimapA' anE svarAla daggarakAni madhyamAvati rAgaM suspaShTaMgA kanipistuMdi. I pATanu sAdhana cEstE madhyamAvati rAgaMpai KaccitaMgA aMi paTTu vastuMdi. pi.bi.SrInivAs kaMThaM rElaMgiki napputuMdani nammi saMgIta darSakuDu yas. rAjESvararAvu. aMdukE 'BalE rAmuDu' lO oka pATa pADistE I sinimAlO reMDu pATalu pADiMcAru. aMtEkAdu - aMtaku muMdugAni, AtarvAta gAni pi.bi.SrInivAs gaLaMlO manaM cUDina jilugulni kUDA rAbaTTArAyana. I sinimAlOni rElaMgiki pi.bi. pADina 'nANemaina sarukuMdi lAhiri' anE pATanu viMTuMTE rElaMgini pi.bi. mimik cEsinaTTu avutuMdi. ika I lATarI pATalO ayitE - POk Taip lO 'aha/aha' ani anaTaMlOnU, paisthAyilO rAgAlApana tIyaTaMlOnU pi.bi.SrInivAslOni gAyakuNNi rAjESvararAvu bAgA reccagoTTagaligAranipistuMdi.
ఈ పాటను పి.బి.శ్రీనివాస్, జిక్కి పాడగా రేలంగి, సూర్యకళ హాస్యనటుడు బాలకృష్ణపై చిత్రీకరించారు. పి.బి.శ్రీనివాస్, జిక్కితో పాటు బాలకృష్ణకు ప్లేబ్యాక్ పాడిన వారి పేరు టైటిల్స్ లో గాని, క్యాసెట్ ఇన్లై కవర్ పై గాని ఎక్కడా పేర్కొడం జరగలేదు. ఈ పాటకు మధ్యమావతి రాగం ఆధారం. 'నిసరిమపా' అనే స్వరాల దగ్గరకాని మధ్యమావతి రాగం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటను సాధన చేస్తే మధ్యమావతి రాగంపై ఖచ్చితంగా అంఇ పట్టు వస్తుంది. పి.బి.శ్రీనివాస్ కంఠం రేలంగికి నప్పుతుందని నమ్మి సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు. అందుకే 'భలే రాముడు' లో ఒక పాట పాడిస్తే ఈ సినిమాలో రెండు పాటలు పాడించారు. అంతేకాదు - అంతకు ముందుగాని, ఆతర్వాత గాని పి.బి.శ్రీనివాస్ గళంలో మనం చూడిన జిలుగుల్ని కూడా రాబట్టారాయన. ఈ సినిమాలోని రేలంగికి పి.బి. పాడిన 'నాణెమైన సరుకుంది లాహిరి' అనే పాటను వింటుంటే రేలంగిని పి.బి. మిమిక్ చేసినట్టు అవుతుంది. ఇక ఈ లాటరీ పాటలో అయితే - ఫోక్ టైప్ లో 'అహ/అహ' అని అనటంలోనూ, పైస్థాయిలో రాగాలాపన తీయటంలోనూ పి.బి.శ్రీనివాస్లోని గాయకుణ్ణి రాజేశ్వరరావు బాగా రెచ్చగొట్టగలిగారనిపిస్తుంది.