This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Aata
Song » Aata..Aata / అ అ అ... ఆట
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 

 
 
idi darSakuDu vi.yan^. aaditya cheppina ee paaTa anubhavaM :
 
naenu, emmes^ raaju gaaru Saastri gaari eduTa koorchunnaaM. 'aaTa' sinimaalO TaiTil^ saaMg^ Tyoon^ viMToo, Saastri gaaru deerghaalOchana nuMchi baiTakochchi, ee pallavi chooDabbaay^... ani ichchaaru.
 
"allaadeen^ adbhuta deepaM.." ani modalautuMdi saaMg^... pillalaki kooDaa paaDukODaaniki taeliggaa vuMTuMdi... annaaru. kaanee, saaMg^ sTaarTiMg^ Too lains^ chaalaa hai pich^ lO unnaayi kadaMDi... iMta taelikaina padaalu baagOvu. aa reMDu lainloo heveegaa vuMDaelaa choosi, mooDO lain^ nuMchi lO pich^ lO uMTaayi kadaa... ee lain^ akkaDa vaaDadaaM annaanu... Saastri gaaru aemee analaedu. kaanee, emmes^ raaju gaariki kOpaM vachchiMdi. pichchi laajikkulu tiyyaku.. ee OpeniMg^ eks^ TraarDanareegaa uMdi... phiks^ ayipO annaaru.
 
naenidi baalaedanalaedu.. deeni muMdu iMkO reMDu lainlu koMcheM gaMbheeraMgaa uMDaalannaanaMDi... aMtae annaanu.. Saastri gaaru aemee maaTlaaDaTlaedu. naaku Tenshan^.. ee lOpala baiTa haallO trivikram^ aedO panimeeda vachchaaru.. emmes^ raaju gaaru ayanni lOpaliki pilichi ee pallavi baavuMdaa, iMkOlaa sTaarT^ avvaalaa cheppaMDi annaaru. allaaDeen^ adbhuta deepaM.. anae saaMg^ sTaarTiMg^ chaalaa kottagaa vuMdi. pillalu kooDaa paaDukuMTaaru - annaaraayana.. vaerae viSaeshaalu maTlaaDaesi veLLipOyaaru. emmes^ raaju gaaru naakiMkO lainu vaddaMDi.. trivikram^, naenu OTaeSaaM. idae phiksayi pOdaaM.. aeM  guruvu gaaroo annaaru... nuvvu, trivikram^, raiT^ ayi vuMDachchu hanee... kaanee, ee paaTa teesae DairekTar^ ki  deeniki saMbaMdhiMchi O vijan^ uMTuMdi.. daaniki ee padaalu myaach^ avvaTlaedani bhaaviMchi, adi cheppaaDu. idelaa uMTuMdi chooDu naannaa.. ani paepar^ ichchaaru naaku..
 
"jeMDaapai kapiraajuMTae.. rathamaapaedevaraMTaa..." ani haipich^ lO reMDu lainlu vachchi, lOpich^ lO mooDO lain^ nuMchi allaadeen^ adbhutadeepaM.." ani kaMTinyoo avutuMdi. aa paaTa alaagae rikaarDu chaesaeSaaM. pavar^ kO, DabbukO, sakses^ kO iMpaarTens^ ivvakuMDaa paaTa teesae darSakuDi vijan^ ni paTTukODaaniki Trai cheyyaDaM - eMta adbhutamaina vishayaM.. alaaMTi adbhutaalu iMchumiMchu pratee paaTakee chaestaaru Saastri gaaru.
 
aayana adRshTaMtO paikochchina vaaru kaadu. medaDuni kattilaa padunupeTTi, Sareeraanni vajraMlaa saanapeTTi, sunnitamaina bhaavajaalaanni kaapaaDukODaaniki bhaashani Daalugaa paTTukoni SrOtala maanasa saamraajyaanni gelavaDaaniki kadana raMgaM lOki dookina veerasainukuDaayana. aa yuddhaM prati paaTakee chaestaaru - gelustaaru.. alasipOtaaru. marO geluputOnae saedadeerutaaru.
 
"ravigaananichO kavigaaMchuneyyaDan^" annaaru. ravi Sareeraanni maatramae taakutaaDu. kavi manasulni kooDaa spRSistaaDu... aMdukae ee sooryuDi kaMTae ee kavi chaMdruDu - sirivennela seetaaraamaSaastri gaaru - eppuDoo goppavaaDae...
 
Important information - Telugu

 ఇది దర్శకుడు వి.యన్. ఆదిత్య చెప్పిన ఈ పాట అనుభవం :

 
నేను, ఎమ్మెస్ రాజు గారు శాస్త్రి గారి ఎదుట కూర్చున్నాం. 'ఆట' సినిమాలో టైటిల్ సాంగ్ ట్యూన్ వింటూ, శాస్త్రి గారు దీర్ఘాలోచన నుంచి బైటకొచ్చి, ఈ పల్లవి చూడబ్బాయ్... అని ఇచ్చారు.
 
"అల్లాదీన్ అద్భుత దీపం.." అని మొదలౌతుంది సాంగ్... పిల్లలకి కూడా పాడుకోడానికి తేలిగ్గా వుంటుంది... అన్నారు. కానీ, సాంగ్ స్టార్టింగ్ టూ లైన్స్ చాలా హై పిచ్ లో ఉన్నాయి కదండి... ఇంత తేలికైన పదాలు బాగోవు. ఆ రెండు లైన్లూ హెవీగా వుండేలా చూసి, మూడో లైన్ నుంచి లో పిచ్ లో ఉంటాయి కదా... ఈ లైన్ అక్కడ వాడదాం అన్నాను... శాస్త్రి గారు ఏమీ అనలేదు. కానీ, ఎమ్మెస్ రాజు గారికి కోపం వచ్చింది. పిచ్చి లాజిక్కులు తియ్యకు.. ఈ ఓపెనింగ్ ఎక్స్ ట్రార్డనరీగా ఉంది... ఫిక్స్ అయిపో అన్నారు.
 
నేనిది బాలేదనలేదు.. దీని ముందు ఇంకో రెండు లైన్లు కొంచెం గంభీరంగా ఉండాలన్నానండి... అంతే అన్నాను.. శాస్త్రి గారు ఏమీ మాట్లాడట్లేదు. నాకు టెన్షన్.. ఈ లోపల బైట హాల్లో త్రివిక్రమ్ ఏదో పనిమీద వచ్చారు.. ఎమ్మెస్ రాజు గారు అయన్ని లోపలికి పిలిచి ఈ పల్లవి బావుందా, ఇంకోలా స్టార్ట్ అవ్వాలా చెప్పండి అన్నారు. అల్లాడీన్ అద్భుత దీపం.. అనే సాంగ్ స్టార్టింగ్ చాలా కొత్తగా వుంది. పిల్లలు కూడా పాడుకుంటారు - అన్నారాయన.. వేరే విశేషాలు మట్లాడేసి వెళ్ళిపోయారు. ఎమ్మెస్ రాజు గారు నాకింకో లైను వద్దండి.. త్రివిక్రమ్, నేను ఓటేశాం. ఇదే ఫిక్సయి పోదాం.. ఏం  గురువు గారూ అన్నారు... నువ్వు, త్రివిక్రమ్, రైట్ అయి వుండచ్చు హనీ... కానీ, ఈ పాట తీసే డైరెక్టర్ కి  దీనికి సంబంధించి ఓ విజన్ ఉంటుంది.. దానికి ఈ పదాలు మ్యాచ్ అవ్వట్లేదని భావించి, అది చెప్పాడు. ఇదెలా ఉంటుంది చూడు నాన్నా.. అని పేపర్ ఇచ్చారు నాకు..
 
"జెండాపై కపిరాజుంటే.. రథమాపేదెవరంటా..." అని హైపిచ్ లో రెండు లైన్లు వచ్చి, లోపిచ్ లో మూడో లైన్ నుంచి అల్లాదీన్ అద్భుతదీపం.." అని కంటిన్యూ అవుతుంది. ఆ పాట అలాగే రికార్డు చేసేశాం. పవర్ కో, డబ్బుకో, సక్సెస్ కో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పాట తీసే దర్శకుడి విజన్ ని పట్టుకోడానికి ట్రై చెయ్యడం - ఎంత అద్భుతమైన విషయం.. అలాంటి అద్భుతాలు ఇంచుమించు ప్రతీ పాటకీ చేస్తారు శాస్త్రి గారు.
 
ఆయన అదృష్టంతో పైకొచ్చిన వారు కాదు. మెదడుని కత్తిలా పదునుపెట్టి, శరీరాన్ని వజ్రంలా సానపెట్టి, సున్నితమైన భావజాలాన్ని కాపాడుకోడానికి భాషని డాలుగా పట్టుకొని శ్రోతల మానస సామ్రాజ్యాన్ని గెలవడానికి కదన రంగం లోకి దూకిన వీరసైనుకుడాయన. ఆ యుద్ధం ప్రతి పాటకీ చేస్తారు - గెలుస్తారు.. అలసిపోతారు. మరో గెలుపుతోనే సేదదీరుతారు.
 
"రవిగాననిచో కవిగాంచునెయ్యడన్" అన్నారు. రవి శరీరాన్ని మాత్రమే తాకుతాడు. కవి మనసుల్ని కూడా స్పృశిస్తాడు... అందుకే ఈ సూర్యుడి కంటే ఈ కవి చంద్రుడు - సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు - ఎప్పుడూ గొప్పవాడే...