This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Paataalabhairavi
Song » Entha ghatu premayo / ఎంత ఘాటు ప్రేమయో
Click To Rate




* Voting Result *
13.33 %
13.33 %
6.67 %
6.67 %
60.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

This song has to be treated as exceptionally great in reflecting the tender emotions of love. We find N.T. Rama Rao with Malathi performing on screen. In his own music direction, Ghantasala along with P.Leela, rendered this song, in such a memorable way that the song remains intact in the hearts of everyone forever.  He used a raaga known as ‘raagesri’ in the Hindustani tradition for tuning this song. Here an anecdote is worth-mentioning.

In 1948, a prominent Hindustani musician Badegulam Alikhan visited Madras and held a music concert. When a member of the executive committee of Madras Music Academy, G.N.Balasubrahmaniam, proposed his name for this concert, there was a strong resentment from several puritan Carnatic musicians. He convinced all of them by saying: ’Just listen to him once, and you will come to know his talent”, and arranged for the concert by Badegulam Alikhan. The audience went into a trance listening to him. Later Badegulam Alikhan could make the entire South India to move in flow with his music! Ghantasala was one among the lovers of his music. He invited Badegulam Alikhan to his home, and played host for two days. He has learnt the nuances of several Hindustani raagas during those two days. Many believe that the influence of Badegulam Alikhan on Ghantasala in employing ‘raagesri’ raaga in tuning this song.

‘Ghaatu prema’, ‘chaatu moham’, ‘theevra veekshanam’, and ‘kannu kaatu’ are some of the poetic words that spontaneously sprouted in the literary field of Pingali to enchant the hearts of all connoisseurs. It is really a great experiment to use ‘ghaatu’ as an adjective with ‘prema’. Even a great poet like Sri Sri made a parody like ‘entha ghaatu premayo intha letu vayasulo’ in Navaraathri. ‘Ghaatu prema’ has such a strong impact on our language.  Later in the movie Attagaaru-Kottakodalu… even though there is a song ‘ghaatu ghaatu prema nagubaatulaayene’… even when “Antha gaatu prema meedi?” has entered the language of common people… we are quite sure that the original inspiration for these expressions is 'enta ghatu premayo’ from Paathaalabharavi!

Translator: suryaprakash.mothiki@yahoo.com



Important information - Telugu

ప్రేమలో పడ్డవారెవరైనా సరే తమ తమ మనోభావాలను ప్రతిఫలింపజేసుకుని చూసుకునే అపురూపగీతంగా 'ఎంత ఘాటు ప్రేమయో' పాటను చెప్పుకోవాలి. తెరపై మాలతి, ఎన్.టి.రామారావు అభినయించిన ఈ పాటను పి.లీలతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో శ్రోతల హౄదయంలో చిరస్ధాయిగా నిలిచిపోయేలా పాడారు ఘంటసాల. హిందుస్థానీ సంప్రదాయానికి చెందిన 'రాగేశ్రీ' అనే రాగాన్ని ఈ పాటను స్వరపరచాటానికి ఉపయోగించారాయన. అందుకు సంబంధించిన ఓ సంఘటనని ఇక్కడ ఉదహరించాలి. 

1948 లో ఓ ప్రముఖ హిందూస్ధానీ విద్వాంసుడు బడేగులాం అలీఖాన్ మద్రాసుకి వచ్చి సంగీత కచ్చేరి ఇవ్వడం జరిగింది. ఆ ప్రదర్శనను మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరయిన ప్రసిద్ధ విద్వాంసులు, జి.యన్.బాలసుబ్రహ్మణ్యం యన పేరుని ప్రతిపాదించగానే పరమ నిష్టాగరిష్టులైన కొందరు కర్ణాటక సంగీత విద్వాంసుల తరపునుండి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. 'ఒక్కసారి వినిచూడండి. ఆ తర్వాత-మీకే తెలుస్తుంది ' అని అందర్నీ సమాధానపరచి బడేగులాం అలీఖాన్ ని రప్పించారు. ఆ సంగీత ప్రదర్శనకు వచ్చిన వారంతా తన్మయత్వంలో మునిగిపోయారు. మర్నాడు ఉదయం ఏనోట విన్నా బడేగులాం అలీఖాన్ గురించే. 

ఆ ఊపులో ఒక్క మద్రాసులోనే 30 నుండి 40 సంగీత ప్రదర్శనలిచ్చారు బడేగులాం అలీఖాన్. ఆ తర్వాత మొత్తం దక్షిణాదిని తన స్వర సామ్రాజ్యంలో లీనం చేసుకోగలిగారాయన. ఆ ప్రభావంలో పడిన వారిలో ఘంటసాల కూడా ఒకరు. బడే గులాం అలీఖాన్ ని తన ఇంటికి అహ్వానించి రెండు రోజులపాటు ఆతిధ్యం ఇచ్చి ఎన్నో హిందూస్థానీ రాగాలను ఆకళింపు చేసుకున్నారు. ఆయనతో తీయించుకున్న ఫొటోలు ఘంటసాల వారింట్లో ఇప్పటికీ వున్నాయి. ఈ పాటకు 'రాగేశ్రీ' రాగాన్ని ఉపయోగించడంలో ఘంటసాలపై బడేగులాం అలీఖాన్ వలన పొందిన సాంగత్య ప్రభావం ఉందంటారు కొంతమంది. 

ఘాటుప్రేమ, చాటు మోహం, తీవ్రవీక్షణం, కన్నుకాటు ఇవన్నీ పింగళి వారి మనో క్షేత్రంలో అలవోకగా మొలకెత్తి ఎందరో రసజ్ఞుల హృదయాలను  పులకింతలతో నింపిన 'పద కావ్యాలు.' ముఖ్యంగా ప్రేమకు ఘాటుని అన్వయించటం ఓ మహత్తర ప్రయోగం. శ్రీ శ్రీ అంతటి మహాకవి కూడా 'ఎంతఘటు ప్రేమయో ఇంత లేటు వయసులో' అంటూ (నవరాత్రిలో) పేరడీ చేసేటంత గాఢంగా ముద్ర వేసుకుందా ప్రయోగం. ఆ తరువాత 'అత్తగారు-కొత్తకోడలు ' చిత్రంలో 'ఘాటు ఘాటు ప్రేమ ఎడబాటులాయెనే' అంటూ మరో పాట వచ్చినా, ప్రేమ గురించి ఎవరైనా మట్లాడితే 'అంత ఘాటు ప్రేమా మీది?' అనే ప్రశ్న వ్యావహారికంలోకి వచ్చేసినా దానికి తొలిప్రేరణ 'పాతాళభైరవి ' లోని ఈ పాటేనని ఘంటాపధంగా చెప్పొచ్చు.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ