This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Vinnavamma Yashodamma / విన్నావ యశోదమ్మా!
Click To Rate




* Voting Result *
0 %
50.00 %
0 %
0 %
50.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 SrIkRuShNuni cinnanATi muccaTlu SrIkRuShNuni eduTE O aMtarnATakaMlA pradarSiMcaTaM, yAdava kuTuMbamaMtA maimaraci  cUstuMDagA - niMDu koluvulO draupadi vastrApaharaNaM jarugutunnaTTu ikkaDa SrIkRuShNuniki teliyaTaM, tadvArA  pAMDavulu tama rAjyAlanu kOlpOyArani I pATa dvArA cUpistAru. tilaMg rAgaMlO modalai 'kAligajjela saMdaDi  cEyaka' daggara cArukESi rAgAnni aMdukuni 'BAmalaMdaroka yuktini panni' daggara pIlU rAgAnni spRuSistU, 'kALiMdi  maDuguna viShamunu kalipe' daggara SaMkarABaraNaM svarAlapai naDustU pATa mottaM jAnapada saMgIta dhOraNilO saMcaristU  uMTuMdi.


en.Ti.rAmArAvu, saMdhya, sAvitri, gummaDi, CAyAdEvi, nAgaBUShaNaM vaMTi muKyapAtradhArulatO pATu eMtOmaMdi  kanipistAru I pATalO! 'vinnAvaTamma O yaSOda gOpika ramaNula kallalu' ani bAlakRuShNuDu aMTuMTE tilakistunna  rukmiNi pAtradhAraNi saMdhya navvina navvulu, 'BAmalaMdaroka yuktini pannigummamu nokaruga kAciyuMDaga' anE vAkyaM  tarvAta vaccE iMTarlUDlO - SaSirEKagA naTiMcina sAvitri cinnapillalA utsAhaMgA cEtitO rukmiNini kudapaTaM ivannI  mAyAbajAr aBimAnulu talcukuni talcukuni murisipOyE muccaTlu.
Important information - Telugu

 శ్రీకృష్ణుని చిన్ననాటి ముచ్చట్లు శ్రీకృష్ణుని ఎదుటే ఓ అంతర్నాటకంలా ప్రదర్శించటం, యాదవ కుటుంబమంతా మైమరచి చూస్తుండగా - నిండు కొలువులో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నట్టు ఇక్కడ శ్రీకృష్ణునికి తెలియటం, తద్వారా పాండవులు తమ రాజ్యాలను కోల్పోయారని ఈ పాట ద్వారా చూపిస్తారు. తిలంగ్ రాగంలో మొదలై 'కాలిగజ్జెల సందడి చేయక' దగ్గర చారుకేశి రాగాన్ని అందుకుని 'భామలందరొక యుక్తిని పన్ని' దగ్గర పీలూ రాగాన్ని స్పృశిస్తూ, 'కాళింది మడుగున విషమును కలిపె' దగ్గర శంకరాభరణం స్వరాలపై నడుస్తూ పాట మొత్తం జానపద సంగీత ధోరణిలో సంచరిస్తూ ఉంటుంది.


ఎన్.టి.రామారావు, సంధ్య, సావిత్రి, గుమ్మడి, ఛాయాదేవి, నాగభూషణం వంటి ముఖ్యపాత్రధారులతో పాటు ఎంతోమంది కనిపిస్తారు ఈ పాటలో! 'విన్నావటమ్మ ఓ యశోద గోపిక రమణుల కల్లలు' అని బాలకృష్ణుడు అంటుంటే తిలకిస్తున్న రుక్మిణి పాత్రధారణి సంధ్య నవ్విన నవ్వులు, 'భామలందరొక యుక్తిని పన్నిగుమ్మము నొకరుగ కాచియుండగ' అనే వాక్యం తర్వాత వచ్చే ఇంటర్లూడ్లో - శశిరేఖగా నటించిన సావిత్రి చిన్నపిల్లలా ఉత్సాహంగా చేతితో రుక్మిణిని కుదపటం ఇవన్నీ మాయాబజార్ అభిమానులు తల్చుకుని తల్చుకుని మురిసిపోయే ముచ్చట్లు.