Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) , S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Comedy Songs
Song- Ragam :
'suMdari nI vaMTi' pATanu GaMTasAla pADagA madhyalO sAvitri svaraM vinipistuMdi. terapai rElaMgi, sAvitri, celikatte pAtradhAraNi aBinayiMcAru. I pATanu GaMTasAla pADina paddhati cirasmaraNIyaM. rElaMgiki GaMTasAla eppuDu pADinA tana pratyEkatanu nilabeTTukuMTUnE pADEvArani mArOsAri nirUpistuMdI pATa. muKyaMgA 'peddalunnAraMTU hadduleMduke ramaNI', tarvAta sAvitri 'A?' aMTE tirigi ''hA!'' aMTunnappuDu - civarna 'suMdarI....suMdarI..' elugetti pilustU jIratO kUDina EDupuni tana kaMThaM dvArA aBinayiMcinappuDu GaMTasAla vAri gAnakaLABinayAniki jOharlu arpiMcakuMDA uMDalEM.
'సుందరి నీ వంటి' పాటను ఘంటసాల పాడగా మధ్యలో సావిత్రి స్వరం వినిపిస్తుంది. తెరపై రేలంగి, సావిత్రి, చెలికత్తె పాత్రధారణి అభినయించారు. ఈ పాటను ఘంటసాల పాడిన పద్ధతి చిరస్మరణీయం. రేలంగికి ఘంటసాల ఎప్పుడు పాడినా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే పాడేవారని మారోసారి నిరూపిస్తుందీ పాట. ముఖ్యంగా 'పెద్దలున్నారంటూ హద్దులెందుకె రమణీ', తర్వాత సావిత్రి 'ఆ?' అంటే తిరిగి ''హా!'' అంటున్నప్పుడు - చివర్న 'సుందరీ....సుందరీ..' ఎలుగెత్తి పిలుస్తూ జీరతో కూడిన ఏడుపుని తన కంఠం ద్వారా అభినయించినప్పుడు ఘంటసాల వారి గానకళాభినయానికి జోహర్లు అర్పించకుండా ఉండలేం.