Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATa BIMplAs rAgaMlO svaraparacabaDiMdi. nijamaina prEma medaDulOni poralalOki coccukuni pOtuMdi. sab kAnShas sTEjlO kUDA prEmiMcina vArinE kalavaristU uMTuMdi. vArE pilicinaTlu anipistU uMTuMdi. kalalOnE oka melukuvagA A melukuvalOnE oka kalagA, kalayO nijamO vaiShNava mAyO telisI teliyanani ayOmayamulO anE caraNaMlO A BAvAnnE ati goppagA vyaktIkariMcAru. ika pAtrOcitamaina padajAlaM upayOgiMcaTaM anE saMpradAyaM gIta racayitalaku kathavalla gala avagAhana teliyacEstuMdi. 'kalayO nijamO vaiShNava mAyO' anE padaprayOgaM kUDA aTuvaMTidE. eMdukaMTE viShNuvu avatAramaina SrIkRuShNuni aBimAniMcE aBimanyuni nOTa 'vaiShNavamAya' ani vastuMdE gAnI 'ISvarEcca' ani rAdugA.
ఈ పాట భీంప్లాస్ రాగంలో స్వరపరచబడింది. నిజమైన ప్రేమ మెదడులోని పొరలలోకి చొచ్చుకుని పోతుంది. సబ్ కాన్షస్ స్టేజ్లో కూడా ప్రేమించిన వారినే కలవరిస్తూ ఉంటుంది. వారే పిలిచినట్లు అనిపిస్తూ ఉంటుంది. కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవ మాయో తెలిసీ తెలియనని అయోమయములో అనే చరణంలో ఆ భావాన్నే అతి గొప్పగా వ్యక్తీకరించారు. ఇక పాత్రోచితమైన పదజాలం ఉపయోగించటం అనే సంప్రదాయం గీత రచయితలకు కథవల్ల గల అవగాహన తెలియచేస్తుంది. 'కలయో నిజమో వైష్ణవ మాయో' అనే పదప్రయోగం కూడా అటువంటిదే. ఎందుకంటే విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అభిమానించే అభిమన్యుని నోట 'వైష్ణవమాయ' అని వస్తుందే గానీ 'ఈశ్వరేచ్చ' అని రాదుగా.