This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jagadeka-veeruni-katha
Song » O Sakhe oho cheli oho / ఓ సఖీ ఒహో చెలి ఒహో
Click To Rate




* Voting Result *
0 %
0 %
100.00 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATa sAkItO modalai 'O saKI OhO celI OhO madiyA mOhini' anE pallavitO sAgE pATanu GaMTasAla pADagA en.Ti.Ar, bi. sarOjAdEvi, yal. vijayalakShmi, jayaMti, bAla aBinayiMcAru. dES rAgAniki I pATa ati cakkani udAharaNa. I pATa vEsukunna mudra eMta paTiShTamainadaMTE - vijayA vAru sumAru 35 saMvatsarAla tarvAta 'BairavadvIpaM' anE citrAnni tiyyAlsi vastE aMdulOni 'eMta eMta eMta mOhamO, rati kAMtuni SRuMgAramaMtramO' anE pATaki I 'O saKI' pATanE prEraNagA cEsukOvalasi vacciMdi.


 'ahO OhO' anE padAlni prayOgiMcaTaMlO piMgaLi vArikO pratyEkata uMdi. 'SrIkRuShNurjuna yuddhaM' (1963) citraMlOni 'annI maMci SakunamulE' pATalO 'manasuna maMgaLa vAdyamahA mrOgelE' anna anu pallavi vinna tarvAtE I viShayAnni cAlAmaMdi gamaniMcagaligAru. TyUn paraMgA I pATalO O tamAShA uMdi. eppaTi nuMcO prAcuryaMlO unna 'BalE maMci cauka bEramu' anE pATalOni rAgAnni pakkani peTTEsi naDakanu mAtraM tIsukuni jAgrattagA gamanistE A tarahA pOkaDa I pATalO akkaDakkaDa kanipiMcE avakASaM uMdi. ayitE dInni kEvalaM AtmASrayamE kAni nirUpaNaku dorakani viShayaMgA pErkonAli.
 
Important information - Telugu

 ఈ పాట సాకీతో మొదలై 'ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదియా మోహిని' అనే పల్లవితో సాగే పాటను ఘంటసాల పాడగా ఎన్.టి.ఆర్, బి. సరోజాదేవి, యల్. విజయలక్ష్మి, జయంతి, బాల అభినయించారు. దేశ్ రాగానికి ఈ పాట అతి చక్కని ఉదాహరణ. ఈ పాట వేసుకున్న ముద్ర ఎంత పటిష్టమైనదంటే - విజయా వారు సుమారు 35 సంవత్సరాల తర్వాత 'భైరవద్వీపం' అనే చిత్రాన్ని తియ్యాల్సి వస్తే అందులోని 'ఎంత ఎంత ఎంత మోహమో, రతి కాంతుని శృంగారమంత్రమో' అనే పాటకి ఈ 'ఓ సఖీ' పాటనే ప్రేరణగా చేసుకోవలసి వచ్చింది.


 'అహో ఓహో' అనే పదాల్ని ప్రయోగించటంలో పింగళి వారికో ప్రత్యేకత ఉంది. 'శ్రీకృష్ణుర్జున యుద్ధం' (1963) చిత్రంలోని 'అన్నీ మంచి శకునములే' పాటలో 'మనసున మంగళ వాద్యమహా మ్రోగెలే' అన్న అను పల్లవి విన్న తర్వాతే ఈ విషయాన్ని చాలామంది గమనించగలిగారు. ట్యూన్ పరంగా ఈ పాటలో ఓ తమాషా ఉంది. ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్న 'భలే మంచి చౌక బేరము' అనే పాటలోని రాగాన్ని పక్కని పెట్టేసి నడకను మాత్రం తీసుకుని జాగ్రత్తగా గమనిస్తే ఆ తరహా పోకడ ఈ పాటలో అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. అయితే దీన్ని కేవలం ఆత్మాశ్రయమే కాని నిరూపణకు దొరకని విషయంగా పేర్కొనాలి.