This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jagadeka-veeruni-katha
Song » Jalakalatalalo / జలకాలాటలలో
Click To Rate




* Voting Result *
0 %
33.33 %
0 %
66.67 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu pi.lIla, pi.suSIla, bRuMdaM pADagA bi.sarOjAdEvi, yal.vijayalakShmi, jayaMti (appuDu kamalakumAri), bAlapai citrIkariMcAru. sannivESa prAdhAnyaMgA madhya madhya en.Ti.Ar. kUDA kanipistAru. pallaviki kIravANi rAgAnni, caraNAlaku naTaBairavi rAgAnni, pallaviki dAritIsE caraNAlalOni AKaru vAkyAlaku tirigi kIravANi rAgAnni upayOgiMcAru. AnATi nuMci InATi varakU sinimAllO snAnaM cEstU pADukunE pATalenni vaccinA sarE I pATa prathama sthAnaMlO uMdaMTE aMduku kAraNaM - vinagAnE nOTiki suluvugA vaccEsE TyUn, viluvalu kOlpOkuMDA sAmAnyuDiki arthamayyElA vADina saraLamaina BASha ani ceppukOvAli. tarvAta vaccina konni sinimAllO I pATa pallavini DailAgski, TyUnni pATala madhya iMTar lUDski vADukOvaTaM kUDA jarigiMdi.


 'allarimoguDu' citraMlOni yOgA I pATa pallavini iMTar lUDgA upayOgiMcukOvaTaM O udAharaNa. rAgaM kIravANi kAbaTTi A citra saMgIta darSakuDu kIravANi alA upayOgiMcukuni uMTADu ani saMgIta priyula madhya appuDappuDu vinipiMcE mATani kEvalaM CalOktigAnE tIsukOvAli. vITanniTikannA I pATalO piMgaLa~ga vADina 'halA' anE mATa guriMci ati muKyaMgA ceppukOvAli. 'halO' anaDAniki badulu camatkAraMgA I mATanu piMgaLi prayOgiMcAranukunnAru A rOjullO cAlAmaMdi.  nijAnikadi kAvyaprayOgamE. pUrvaM ennO saMskRuta nATakAlalO I prayOgaM jarigiMdi. celikattenu 'halA' ani saMBOdiMcAlani amaraMlO kUDA uMdi. Edi EmainA viraLaMgA (arudugA) laByamayyE padAlni aTu taraLaMgAnu (prakASiMcETTugA) iTu saraLaMgAnu vADina piMgaLiki telugu sinI saMgIta sAhityABimAnulu RuNapaDi uMDaka tappadu.
Important information - Telugu

 ఈ పాటను పి.లీల, పి.సుశీల, బృందం పాడగా బి.సరోజాదేవి, యల్.విజయలక్ష్మి, జయంతి (అప్పుడు కమలకుమారి), బాలపై చిత్రీకరించారు. సన్నివేశ ప్రాధాన్యంగా మధ్య మధ్య ఎన్.టి.ఆర్. కూడా కనిపిస్తారు. పల్లవికి కీరవాణి రాగాన్ని, చరణాలకు నటభైరవి రాగాన్ని, పల్లవికి దారితీసే చరణాలలోని ఆఖరు వాక్యాలకు తిరిగి కీరవాణి రాగాన్ని ఉపయోగించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ సినిమాల్లో స్నానం చేస్తూ పాడుకునే పాటలెన్ని వచ్చినా సరే ఈ పాట ప్రథమ స్థానంలో ఉందంటే అందుకు కారణం - వినగానే నోటికి సులువుగా వచ్చేసే ట్యూన్, విలువలు కోల్పోకుండా సామాన్యుడికి అర్థమయ్యేలా వాడిన సరళమైన భాష అని చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో ఈ పాట పల్లవిని డైలాగ్స్కి, ట్యూన్ని పాటల మధ్య ఇంటర్ లూడ్స్కి వాడుకోవటం కూడా జరిగింది.


 'అల్లరిమొగుడు' చిత్రంలోని యోగా ఈ పాట పల్లవిని ఇంటర్ లూడ్గా ఉపయోగించుకోవటం ఓ ఉదాహరణ. రాగం కీరవాణి కాబట్టి ఆ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి అలా ఉపయోగించుకుని ఉంటాడు అని సంగీత ప్రియుల మధ్య అప్పుడప్పుడు వినిపించే మాటని కేవలం ఛలోక్తిగానే తీసుకోవాలి. వీటన్నిటికన్నా ఈ పాటలో పింగళఙ వాడిన 'హలా' అనే మాట గురించి అతి ముఖ్యంగా చెప్పుకోవాలి. 'హలో' అనడానికి బదులు చమత్కారంగా ఈ మాటను పింగళి ప్రయోగించారనుకున్నారు ఆ రోజుల్లో చాలామంది.  నిజానికది కావ్యప్రయోగమే. పూర్వం ఎన్నో సంస్కృత నాటకాలలో ఈ ప్రయోగం జరిగింది. చెలికత్తెను 'హలా' అని సంభోదించాలని అమరంలో కూడా ఉంది. ఏది ఏమైనా విరళంగా (అరుదుగా) లభ్యమయ్యే పదాల్ని అటు తరళంగాను (ప్రకాశించేట్టుగా) ఇటు సరళంగాను వాడిన పింగళికి తెలుగు సినీ సంగీత సాహిత్యాభిమానులు ఋణపడి ఉండక తప్పదు.