This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Donga-Ramudu
Song » Anuragam Virisenaa / అనురాగం విరిసేనా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
33.33 %
66.67 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu pi.suSIla pADagA jamuna aBinayiMcAru. sannivESa prAdhAnyaMgA jaggayya vErE ShATlalO akkaDakkaDa kanipistAru. idi bottigA, pUrtigA peMDyAla vAri pATa. peMDyAla mArk BIMplAs rAgaM pATaMtA parucukuni vinipistU uMTuMdi. kAvAlaMTE - caraNAlalOni modaTi reMDu lainulU AlapiMcukuni cUDaMDi. 


A AlApana - O nelarAjA vennela rAjA mA vennelanni cinnelanni nIkEnO I (BaTTi vikramArka), A pUladArulalO A nIli tArala vennela snAnAlu cEyudamA (nAkaMTi pApala nilicipOrA - vAgdhAnaM), nIli mEGAlalO gAli keraTAlalO (bAvA maradaLLu), dharaNi nEmi mahima cUpa dvArakalO nuMTivO (dEva dEva nArAyaNa paraMdhAma paramAtraM - SrIkRuShNArjuna yuddhaM).... lIlA Sukulu RuShyaSRuMgulu mana yatIMdrulai velasirigA (svAmula sEvaku vELAye - SrIkRuShNArjuna yuddhaM)....vaMTi varasalni varusagA mana manasullO kadalADETTu cEstuMdi.


BIMplAs peMDyAla mArku varasalivi. I pATalO jamunani ekkuvagA eDaMvaipu nuMDE citrIkariMcaTaM jarigiMdi.  dAMtO Ameki kuDivaipugala 'pannu mIda pannu' dRuSyaparaMgA kottaMdAlanu cUpiMcaTaM, A pannu mIda pannu tarvAta citrAllO O viSEShAkarShaNagA mAraDaM, tAhaSildAru gArammAyi vaMTi citrAllO A pannu mIdE O DailAgu uMDaDaM - vITanniTikI - anurAgaM virisEnA pATE SuBAraMBaM kAvaTaM ceppukOdagga viSEShaM.

Important information - Telugu

ఈ పాటను పి.సుశీల పాడగా జమున అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా జగ్గయ్య వేరే షాట్లలో అక్కడక్కడ కనిపిస్తారు. ఇది బొత్తిగా, పూర్తిగా పెండ్యాల వారి పాట. పెండ్యాల మార్క్ భీంప్లాస్ రాగం పాటంతా పరుచుకుని వినిపిస్తూ ఉంటుంది. కావాలంటే - చరణాలలోని మొదటి రెండు లైనులూ ఆలపించుకుని చూడండి. 

ఆ ఆలాపన - ఓ నెలరాజా వెన్నెల రాజా మా వెన్నెలన్ని చిన్నెలన్ని నీకేనో ఈ (భట్టి విక్రమార్క), ఆ పూలదారులలో ఆ నీలి తారల వెన్నెల స్నానాలు చేయుదమా (నాకంటి పాపల నిలిచిపోరా - వాగ్ధానం), నీలి మేఘాలలో గాలి కెరటాలలో (బావా మరదళ్ళు), ధరణి నేమి మహిమ చూప ద్వారకలో నుంటివో (దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్రం - శ్రీకృష్ణార్జున యుద్ధం).... లీలా శుకులు ఋష్యశృంగులు మన యతీంద్రులై వెలసిరిగా (స్వాముల సేవకు వేళాయె - శ్రీకృష్ణార్జున యుద్ధం)....వంటి వరసల్ని వరుసగా మన మనసుల్లో కదలాడేట్టు చేస్తుంది.

భీంప్లాస్ పెండ్యాల మార్కు వరసలివి. ఈ పాటలో జమునని ఎక్కువగా ఎడంవైపు నుండే చిత్రీకరించటం జరిగింది.  దాంతో ఆమెకి కుడివైపుగల 'పన్ను మీద పన్ను' దృశ్యపరంగా కొత్తందాలను చూపించటం, ఆ పన్ను మీద పన్ను తర్వాత చిత్రాల్లో ఓ విశేషాకర్షణగా మారడం, తాహశిల్దారు గారమ్మాయి వంటి చిత్రాల్లో ఆ పన్ను మీదే ఓ డైలాగు ఉండడం - వీటన్నిటికీ - అనురాగం విరిసేనా పాటే శుభారంభం కావటం చెప్పుకోదగ్గ విశేషం.