Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla pADagA terapai en.Ti.rAmArAvu pradhAna pAtradhArigA aBinayiMcAru. bi.sarOjAdEvi, marikoMdaru upapAtradhArulu sannivESa prAdhAnyaMgA kanipistAru. 'ha' kArAnni pATalalO peTTi anirvacanIyamaina AnaMdAnni, mattuni kalagacEsina oravaDi GaMTasAladE... telugu sinI saMgItAniki saMbaMdhiMcinaMta varaku A prakriyalO evaru pADavalasi vaccinA Ayananu anukariMcaka tappadu. lEdA kanIsaM gurtu cEsE vidhaMgAnainA pADaka tappadu. I pATalO 'AhahahA' ani GaMTasAla aMTunnappuDu Ayana kaMThaMlO toNikisalADina jilugulu, sogasulu kEvalaM avi tama vInula dvArA aMdukOgaligina vArikE telustuMdadi.
sAhityaparaMgA cUsukuMTE reMDava caraNaMlOni - 'mOhamUriMcu paruvAla gOlaku mutaka teracATu alavATulElanE nEDu venakADinA rEpu onagUDunA' anE vAkyAlanu vivaraNAtmakaMgA viSlEShiMcavalasi vastE SRuMgAraparaMgA eMtO Deptki veLLi ceppavalasi uMTuMdi. okkokkasAri adi GATugA kUDA uMTuMdi. aMcEta A vAkyAlanu uparitalaM mIdanuMcE sparSiMci iMdulO Dept uMdi ani cinnagA AlOcananu rEkettiMcagilistE cAlu. A taruvAta evari saMskArAnni baTTi vAru tarkiMcukuMTAru.
ఈ పాటను ఘంటసాల పాడగా తెరపై ఎన్.టి.రామారావు ప్రధాన పాత్రధారిగా అభినయించారు. బి.సరోజాదేవి, మరికొందరు ఉపపాత్రధారులు సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. 'హ' కారాన్ని పాటలలో పెట్టి అనిర్వచనీయమైన ఆనందాన్ని, మత్తుని కలగచేసిన ఒరవడి ఘంటసాలదే... తెలుగు సినీ సంగీతానికి సంబంధించినంత వరకు ఆ ప్రక్రియలో ఎవరు పాడవలసి వచ్చినా ఆయనను అనుకరించక తప్పదు. లేదా కనీసం గుర్తు చేసే విధంగానైనా పాడక తప్పదు. ఈ పాటలో 'ఆహహహా' అని ఘంటసాల అంటున్నప్పుడు ఆయన కంఠంలో తొణికిసలాడిన జిలుగులు, సొగసులు కేవలం అవి తమ వీనుల ద్వారా అందుకోగలిగిన వారికే తెలుస్తుందది.
సాహిత్యపరంగా చూసుకుంటే రెండవ చరణంలోని - 'మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటులేలనే నేడు వెనకాడినా రేపు ఒనగూడునా' అనే వాక్యాలను వివరణాత్మకంగా విశ్లేషించవలసి వస్తే శృంగారపరంగా ఎంతో డెప్త్కి వెళ్ళి చెప్పవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఘాటుగా కూడా ఉంటుంది. అంచేత ఆ వాక్యాలను ఉపరితలం మీదనుంచే స్పర్శించి ఇందులో డెప్త్ ఉంది అని చిన్నగా ఆలోచనను రేకెత్తించగిలిస్తే చాలు. ఆ తరువాత ఎవరి సంస్కారాన్ని బట్టి వారు తర్కించుకుంటారు