This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Panduranga-Mahathyam
Song » Neevani nenani talachitaa / నీవని నేనని తలచితా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

'nIvani nEnani talacitirA' pATanu GaMTasAla, suSIla pADAru. terapai en.Ti.Ar, bi.sarOjAdEvi aBinayiMcAru. 'naTaBairava' rAgAnni pradhAnaMgA tIsukuni I pATani allukunnAru. 'ni' anna svarAnni marOsAri vEstE I rAgaM kIravANi rAgamaipOtuMdi. alA reMDu 'ni'lani (kaiSika niShAdaM, kAkali niShAdaM) prayOgistU kIravANi rAgaMlA dhvaniMcakuMDA eMtO jAgrattagA malicAru Ti.vi.rAju. katha prakAraM vESya vyAmOhaMlO cikkukunna kathAnAyakuDu AmetO kalisi pADina pATa idi.

A rOjullO kathA carcallO saMgIta darSakuni pAtra kUDA pramuKaMgA uMDEdi kanuka I pATa prAdhAnyata telisina Ti.vi.rAju pATalO O rakamaina vaSIkaraNa Saktini niMpi marI TyUn cESAranipistuMdi. dAniki nidarSanaM - iMTar lUDs annI arabik saMgIta rItullO uMDaTamE. I rakamaina parShiyan, arabik saMgItAniki vaSIkaraNa sAmarthyaM uMTuMdani lOgaDa 'vipranArAyaNa' citraMlO  'eMdukOyI tOTamAli' pATaku saMbaMdhiMcina viSlEShaNatO vivariMcaTaM jarigiMdi. marikAsta lOtullOki veLitE, 'pAMDuraMga mahatyaM' gAni ALvArulaku saMbaMdhiMcina 'vipranArAyaNa'gAni, paurANika nEpathyaMlO rUpudiddukunnadE.

A citrAllOni pATalaku sanAtana saMpradAyapu pOkaDalatO kUDina varasalu kAkuMDA arabik, parShiyan saMgIta rItulni ASrayiMcaTaM eMtavaraku sababu - anna AlOcana kUDA rAnIyanaMta unnataMgA, sahajaMgA imiDci pATa aMdAlanu inumaDiMpa cEsina Ti.vi.rAjuni (vipranArAyaNa saMgIta darSakuDaina es.rAjESvararAvutO pATu) aBinaMdiMcakuMDA uMDalEM.

Important information - Telugu

'నీవని నేనని తలచితిరా' పాటను ఘంటసాల, సుశీల పాడారు. తెరపై ఎన్.టి.ఆర్, బి.సరోజాదేవి అభినయించారు. 'నటభైరవ' రాగాన్ని ప్రధానంగా తీసుకుని ఈ పాటని అల్లుకున్నారు. 'ని' అన్న స్వరాన్ని మరోసారి వేస్తే ఈ రాగం కీరవాణి రాగమైపోతుంది. అలా రెండు 'ని'లని (కైశిక నిషాదం, కాకలి నిషాదం) ప్రయోగిస్తూ కీరవాణి రాగంలా ధ్వనించకుండా ఎంతో జాగ్రత్తగా మలిచారు టి.వి.రాజు. కథ ప్రకారం వేశ్య వ్యామోహంలో చిక్కుకున్న కథానాయకుడు ఆమెతో కలిసి పాడిన పాట ఇది.

ఆ రోజుల్లో కథా చర్చల్లో సంగీత దర్శకుని పాత్ర కూడా ప్రముఖంగా ఉండేది కనుక ఈ పాట ప్రాధాన్యత తెలిసిన టి.వి.రాజు పాటలో ఓ రకమైన వశీకరణ శక్తిని నింపి మరీ ట్యూన్ చేశారనిపిస్తుంది. దానికి నిదర్శనం - ఇంటర్ లూడ్స్ అన్నీ అరబిక్ సంగీత రీతుల్లో ఉండటమే. ఈ రకమైన పర్షియన్, అరబిక్ సంగీతానికి వశీకరణ సామర్థ్యం ఉంటుందని లోగడ 'విప్రనారాయణ' చిత్రంలో  'ఎందుకోయీ తోటమాలి' పాటకు సంబంధించిన విశ్లేషణతో వివరించటం జరిగింది. మరికాస్త లోతుల్లోకి వెళితే, 'పాండురంగ మహత్యం' గాని ఆళ్వారులకు సంబంధించిన 'విప్రనారాయణ'గాని, పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే.

 ఆ చిత్రాల్లోని పాటలకు సనాతన సంప్రదాయపు పోకడలతో కూడిన వరసలు కాకుండా అరబిక్, పర్షియన్ సంగీత రీతుల్ని ఆశ్రయించటం ఎంతవరకు సబబు - అన్న ఆలోచన కూడా రానీయనంత ఉన్నతంగా, సహజంగా ఇమిడ్చి పాట అందాలను ఇనుమడింప చేసిన టి.వి.రాజుని (విప్రనారాయణ సంగీత దర్శకుడైన ఎస్.రాజేశ్వరరావుతో పాటు) అభినందించకుండా ఉండలేం.