This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Panduranga-Mahathyam
Song » Jaya krishna mukundaa / జయకృష్ణా ముకుందా
Click To Rate
* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

'kRuShNA mukuMdA murArI' pATa O manOhara rAgamAlika. pallaviki, modaTi caraNAniki mOhanarAgAnni upayOgiMcAru. 'velasiti vaMTa' daggara A rAgaMlO paDakUDani madhyamaM ('ma' anna svaraM)tO kUDina adi kUDA aMdAnni peMcEdigAnE uMdi. 'nI palugAki' caraNAniki kaLyANi rAgAnni vADukunnAru. padyAla AlApanaku anuvaina AraBi rAgAnni 'ammA tammuDu mannu tinEnu' anna padyAnni upayOgiMcAru. 'kALIya PaNi PaNi' caraNAnni mAMD rAgaMlO malacAru. lIlASukuDu rAsina 'SrIkRuShNa karNAmRutaM'lOni 'kastUri tilakaM' SlOkAniki I pATalO samucita sthAnaM kalpiMcaTaM aucityAniki niluvettu nidarSanaM.

hiMdOLarAgaMlO svaraparacina I SlOkaM taruvAta vaccE 'ma' (madhyamaM) svarAnni na (ShaDjamaM) svaraMgA cEsukuni 'lalita lalita muraLI svarALi' anE caraNAnni svaraparacAru. ilA cEyaTAnni grahaBEdaM aMTAru. A rakaMgA cEyaMcaTaM valla pATa civarna 'hE kRuShNA' aMTU tArAsthAyilO AlapiMci SrOtala hRudayAlaku O jaladariMpu, kanulaku cemariMpu cEkUrcagaligAru GaMTasAla. 'lalita lalita muraLI svarALi' anE caraNAnni yaman rAgAnni AdhAraMgA cEsukuni svaraparicAru. iMkAsta taraci cUstE 1936lO vacci pATala paraMgA prajAdaraNaku nOcukunna 'saMt tukAraM' citaMlOni 'AdI bIjayIkaLE, dvija aMkurAlE, rUpavADhalE' anE marAThI gIta CAyalu kanipistAyi. taruvAta 1973lO telugulO vaccina 'BaktatukAraM' citraMlO vinapiMcina aBaMgAlalOni 'nIvE adi daivamu' anE caraNAniki I TyUnni yathAtathaMgA saMgIta darSakuDu AdinArAyaNarAvu vADAru.

 'pAMDuraMga mahatyaM'ki saMgItAnni iccina Ti.vi.rAju okappuDu AdinArAyaNarAvugAri daggara SiShyarikaM cEsinavArE kanuka, appaTikE AdinArAyaNarAvugAriki marAThI saMgItaM mIda kUDA avagAhana uMDaTaM valla 'lalita lalita' caraNAniki marAThI gIta suvAsanalu abbaDaMlO AScaryaM lEdu. 'kRuShNAmukuMdA murArI'lO pATaku cEsina svara racana aMtA oka ettu. 'lalita lalita muraLI svarALI' caraNaM tarvAta sumAru reMDunnara nimiShAla pATu vaccE vAdya saMgItaM okkaTI oka ettu. vENuvAdyaMlO naipuNyaM saMpAdiMcAlanukunE vAraivarainA sarE I vAdya sammELanAnni okasAri ganaka vinaTaM taTasthistE sAdhana cEyakuMDA uMDaTaM kaShTaM.

I citraM darSaka naTi vijayanirmala tolicitraM kAvaTaM, Ame SrIkRuShNunigA kanipiMcaTaM, taruvAti rOjullO Ame pApular ayyAka I gItAniki cEkUrina marO pratyEkata. pATa taruvAta vaccE daMDakaM AraBi rAgaMlO svaraparacabaDiMdi. iTuvaMTi daMDakAlanu, SlOkAlanu sAdhana cEyaTaM vAksuddhini kOlpOtunna InATi autsAhika gAyakulaku atyaMta avasaraM.

Important information - Telugu

'కృష్ణా ముకుందా మురారీ' పాట ఓ మనోహర రాగమాలిక. పల్లవికి, మొదటి చరణానికి మోహనరాగాన్ని ఉపయోగించారు. 'వెలసితి వంట' దగ్గర ఆ రాగంలో పడకూడని మధ్యమం ('మ' అన్న స్వరం)తో కూడిన అది కూడా అందాన్ని పెంచేదిగానే ఉంది. 'నీ పలుగాకి' చరణానికి కళ్యాణి రాగాన్ని వాడుకున్నారు. పద్యాల ఆలాపనకు అనువైన ఆరభి రాగాన్ని 'అమ్మా తమ్ముడు మన్ను తినేను' అన్న పద్యాన్ని ఉపయోగించారు. 'కాళీయ ఫణి ఫణి' చరణాన్ని మాండ్ రాగంలో మలచారు. లీలాశుకుడు రాసిన 'శ్రీకృష్ణ కర్ణామృతం'లోని 'కస్తూరి తిలకం' శ్లోకానికి ఈ పాటలో సముచిత స్థానం కల్పించటం ఔచిత్యానికి నిలువెత్తు నిదర్శనం.

 హిందోళరాగంలో స్వరపరచిన ఈ శ్లోకం తరువాత వచ్చే 'మ' (మధ్యమం) స్వరాన్ని న (షడ్జమం) స్వరంగా చేసుకుని 'లలిత లలిత మురళీ స్వరాళి' అనే చరణాన్ని స్వరపరచారు. ఇలా చేయటాన్ని గ్రహభేదం అంటారు. ఆ రకంగా చేయంచటం వల్ల పాట చివర్న 'హే కృష్ణా' అంటూ తారాస్థాయిలో ఆలపించి శ్రోతల హృదయాలకు ఓ జలదరింపు, కనులకు చెమరింపు చేకూర్చగలిగారు ఘంటసాల. 'లలిత లలిత మురళీ స్వరాళి' అనే చరణాన్ని యమన్ రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరపరిచారు. ఇంకాస్త తరచి చూస్తే 1936లో వచ్చి పాటల పరంగా ప్రజాదరణకు నోచుకున్న 'సంత్ తుకారం' చితంలోని 'ఆదీ బీజయీకళే, ద్విజ అంకురాలే, రూపవాఢలే' అనే మరాఠీ గీత ఛాయలు కనిపిస్తాయి. తరువాత 1973లో తెలుగులో వచ్చిన 'భక్తతుకారం' చిత్రంలో వినపించిన అభంగాలలోని 'నీవే అది దైవము' అనే చరణానికి ఈ ట్యూన్ని యథాతథంగా సంగీత దర్శకుడు ఆదినారాయణరావు వాడారు.

'పాండురంగ మహత్యం'కి సంగీతాన్ని ఇచ్చిన టి.వి.రాజు ఒకప్పుడు ఆదినారాయణరావుగారి దగ్గర శిష్యరికం చేసినవారే కనుక, అప్పటికే ఆదినారాయణరావుగారికి మరాఠీ సంగీతం మీద కూడా అవగాహన ఉండటం వల్ల 'లలిత లలిత' చరణానికి మరాఠీ గీత సువాసనలు అబ్బడంలో ఆశ్చర్యం లేదు. 'కృష్ణాముకుందా మురారీ'లో పాటకు చేసిన స్వర రచన అంతా ఒక ఎత్తు. 'లలిత లలిత మురళీ స్వరాళీ' చరణం తర్వాత సుమారు రెండున్నర నిమిషాల పాటు వచ్చే వాద్య సంగీతం ఒక్కటీ ఒక ఎత్తు. వేణువాద్యంలో నైపుణ్యం సంపాదించాలనుకునే వారైవరైనా సరే ఈ వాద్య సమ్మేళనాన్ని ఒకసారి గనక వినటం తటస్థిస్తే సాధన చేయకుండా ఉండటం కష్టం.

ఈ చిత్రం దర్శక నటి విజయనిర్మల తొలిచిత్రం కావటం, ఆమె శ్రీకృష్ణునిగా కనిపించటం, తరువాతి రోజుల్లో ఆమె పాపులర్ అయ్యాక ఈ గీతానికి చేకూరిన మరో ప్రత్యేకత. పాట తరువాత వచ్చే దండకం ఆరభి రాగంలో స్వరపరచబడింది. ఇటువంటి దండకాలను, శ్లోకాలను సాధన చేయటం వాక్సుద్ధిని కోల్పోతున్న ఈనాటి ఔత్సాహిక గాయకులకు అత్యంత అవసరం.