Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Sad & Patho songs
Song- Ragam :
'ammA ani aracinA' pATa siMdhuBairavi rAgaMlO kUrcabaDiMdi vistRutamaina paridhigala saMpradAyaMlO 'Bairavi' ani aMTAru. hanumattODi rAgAniki janyarAgamaina I siMdhuBairavi rAgAnni AviShkariMcaTAniki upayOgiMcukunnAru mana saMgIta darSakulu. ayitE Bakti, viShAdaM I rAgaMlO bAgA paMDutAyani 'ammA ani aracinA' pATa dvArA anipistuMdi. kathAnAyakuni manastatvaM viShAdayOgaM nuMDi Bakti mArgAniki payaniMcanunnadanna kathAkramAnni sUtraprAyaMgA kAkuMDA sannivESaparaMgA kUDA balaMgA hattukOvaTAniki I rAgaM eMtagA dOhadaM cEsiMdO pATa vinnavAriki bAgA anuBavamavutuMdi. sAdhAraNaMgA bAdhatO guMDe baruvekkinapuDu kaMThaM ruddhamaipOtuMdi. appuDu pATE kAdu mATa kUDA spaShTatanu kOlpOtuMdi. kAnI SOkarasAniki jIvaM pOstU, vinnavAri hRudayAlalO sAnuBUti rasAnuBUti kaligElA gAdgadikagaLaMtO anitara sAdhyaMgA GaMTasAla pADE paddhatiki A tarkaM talapulOMci pAripOtuMdi. manasaMtA GaMTasAla svaramAdhuryaMtO mArmOgipOtuMdi.
ika sAhityaparaMgA ceppAlaMTE - samudrAla (jUniyar) lOtula keLLi rASAranistuMdI pATani. reMDO caraNaMlO unna 'dEhamu vij~jAnamu brahmOpadESamicci ihaparAlu sAdhiMcE hitamiccina taMDrini' anna vAkyAlE aMduku udAharaNa. SarIrAniki prANAdhAramaina bIjOtpattiki kArakuDu taMDri. ahaM bIjaH pradhaH pitA (taMDrigA nEnE bIjamunai unnAnu) aMTU BagavadgItalO ceppinadI adE. ihalOkAniki saMbaMdhiMcina SarIraMtO paralOkAniki saMbaMdhiMcina vij~jAnAnni sAdhiMcaTAniki kAvalasina hitavE brahmOpadESaM.
aMdukE upanayanaMlO gAyatri maMtrAnni vaTuvu cevilO taMDri cEta ceppistAru. taMDri yokka prAdhAnyatani, prAmuKyatani ceppaTAniki samudrAla ennukunna vastuvu eMta praSasthaMgA uMdO teliyacEyaTAniki iMtakannA vErE udAharaNa EmuMdi? telisina maMci viShayAnni prajalaku upayOgapaDErItilO ceppaTaMlOnE kavi janmaku sArthaKata cEkUrutuMdi. I rItilO I gItAnni rAsina samudrAla (jUniyar), AyanalOni kavitAtmaku 'ahaM bIjaH pradhaH pita' annaTlugA prErakuDaina samudrAla sIniyar I saMdarBaMgA aBinaMdanIyulu.
'అమ్మా అని అరచినా' పాట సింధుభైరవి రాగంలో కూర్చబడింది విస్తృతమైన పరిధిగల సంప్రదాయంలో 'భైరవి' అని అంటారు. హనుమత్తోడి రాగానికి జన్యరాగమైన ఈ సింధుభైరవి రాగాన్ని ఆవిష్కరించటానికి ఉపయోగించుకున్నారు మన సంగీత దర్శకులు. అయితే భక్తి, విషాదం ఈ రాగంలో బాగా పండుతాయని 'అమ్మా అని అరచినా' పాట ద్వారా అనిపిస్తుంది. కథానాయకుని మనస్తత్వం విషాదయోగం నుండి భక్తి మార్గానికి పయనించనున్నదన్న కథాక్రమాన్ని సూత్రప్రాయంగా కాకుండా సన్నివేశపరంగా కూడా బలంగా హత్తుకోవటానికి ఈ రాగం ఎంతగా దోహదం చేసిందో పాట విన్నవారికి బాగా అనుభవమవుతుంది. సాధారణంగా బాధతో గుండె బరువెక్కినపుడు కంఠం రుద్ధమైపోతుంది. అప్పుడు పాటే కాదు మాట కూడా స్పష్టతను కోల్పోతుంది.
కానీ శోకరసానికి జీవం పోస్తూ, విన్నవారి హృదయాలలో సానుభూతి రసానుభూతి కలిగేలా గాద్గదికగళంతో అనితర సాధ్యంగా ఘంటసాల పాడే పద్ధతికి ఆ తర్కం తలపులోంచి పారిపోతుంది. మనసంతా ఘంటసాల స్వరమాధుర్యంతో మార్మోగిపోతుంది. ఇక సాహిత్యపరంగా చెప్పాలంటే - సముద్రాల (జూనియర్) లోతుల కెళ్ళి రాశారనిస్తుందీ పాటని. రెండో చరణంలో ఉన్న 'దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని' అన్న వాక్యాలే అందుకు ఉదాహరణ. శరీరానికి ప్రాణాధారమైన బీజోత్పత్తికి కారకుడు తండ్రి. అహం బీజః ప్రధః పితా (తండ్రిగా నేనే బీజమునై ఉన్నాను) అంటూ భగవద్గీతలో చెప్పినదీ అదే.
ఇహలోకానికి సంబంధించిన శరీరంతో పరలోకానికి సంబంధించిన విజ్ఞానాన్ని సాధించటానికి కావలసిన హితవే బ్రహ్మోపదేశం. అందుకే ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని వటువు చెవిలో తండ్రి చేత చెప్పిస్తారు. తండ్రి యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని చెప్పటానికి సముద్రాల ఎన్నుకున్న వస్తువు ఎంత ప్రశస్థంగా ఉందో తెలియచేయటానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏముంది? తెలిసిన మంచి విషయాన్ని ప్రజలకు ఉపయోగపడేరీతిలో చెప్పటంలోనే కవి జన్మకు సార్థఖత చేకూరుతుంది. ఈ రీతిలో ఈ గీతాన్ని రాసిన సముద్రాల (జూనియర్), ఆయనలోని కవితాత్మకు 'అహం బీజః ప్రధః పిత' అన్నట్లుగా ప్రేరకుడైన సముద్రాల సీనియర్ ఈ సందర్భంగా అభినందనీయులు.