Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : A.P.Komala / ఎ.పి.కోమల , Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
1948 lO pramuKa hiMdusthAnI vidvAMsuDu baDEgulAM alIKAn madrAsuki vacci saMgIta kaccErI ivvaDaM, A praBAvaMlO paDina GaMTasAla tana iMTiki baDEgulAM alIKAn ni AhvAniMci reMDurOjulapATu AtidhyaM icci ennO hiMdUsdhAnI rAgAlanu AkaLiMpu cEsukOvaTaM jarigiMdi. alA AkaLiMpu cEsukunna rAgAlalO rAgESvari okaTi.
aMcEta I 'idi nA celi ' pATaku hiMdUsdhAnI saMpradAyAniki ceMdina 'rAgESvari ' rAgAnni upayOgiMcaDaM venuka baDEgulAM alIKAn tO paMcukunna sAMgatya vaiBavaM vuMdaMTAru koMtamaMdi. alAgE 'evarivO ecaTa nuMTivO' pATaku upayOgiMcina 'mOhana ' rAgaMlO cEsina konni anyasvarAla prayOgAniki kUDA A prEraNa uMdani vinikiDi.
janaraMjakatvaM kOsaM rAgAlanu miSramaM cEsukunE saulaByaM, cevikiMpugA uMDEMtavaraku AlApanalO svataMtra saMcAraM cEsukunE vIlu - hiMdUsdhAnI saMpradAyaMlOnu, muKyaMgA lalitagItAla svarakalpanalOnu uMdi. I avakASAlanniMTinI alavOkagA aMdipuccukuni atyadButaMgA svaraparaci - muMdu anukunnaTlugA - BAvAnni araTipaMDu olici cEtilO peTTinaMta suluvugA tana gaLamAdhuryaMtO prEkShaka SrOtala hRudayAlanu I pATala dvArA rasaplAvitaM cEyagaligAru GaMTasAla.
ika sAhitya paraMgA ceppAlaMTE celi, saKi, manOhari, callani siri, lahari, taniviniMcu, caMcalavO, milamilavO ivannI piMgaLi vAri pALipai murisi, merisina taLataLalE...
I 'evarivO' pATa mugiyagAnE sinimAlO duShTapAtra dhariMcina mahAnaTi sAvitri aBinayiMcina O svaraKaMDika vastuMdi. e.pi.kOmala pADagA, kaLyANi rAgaMlO svaraparacabaDina I caraNaM sAhityaM ilA uMTuMdi.
valapu pATa vinagAne
nilavalEka cEritinOy
manasu paDina varAlosagi
ninu tariMpajEyudunOy
saKA O saKA.....
1948 లో ప్రముఖ హిందుస్థానీ విద్వాంసుడు బడేగులాం అలీఖాన్ మద్రాసుకి వచ్చి సంగీత కచ్చేరీ ఇవ్వడం, ఆ ప్రభావంలో పడిన ఘంటసాల తన ఇంటికి బడేగులాం అలీఖాన్ ని ఆహ్వానించి రెండురోజులపాటు ఆతిధ్యం ఇచ్చి ఎన్నో హిందూస్ధానీ రాగాలను ఆకళింపు చేసుకోవటం జరిగింది. అలా ఆకళింపు చేసుకున్న రాగాలలో రాగేశ్వరి ఒకటి.
అంచేత ఈ 'ఇది నా చెలి ' పాటకు హిందూస్ధానీ సంప్రదాయానికి చెందిన 'రాగేశ్వరి ' రాగాన్ని ఉపయోగించడం వెనుక బడేగులాం అలీఖాన్ తో పంచుకున్న సాంగత్య వైభవం వుందంటారు కొంతమంది. అలాగే 'ఎవరివో ఎచట నుంటివో' పాటకు ఉపయోగించిన 'మోహన ' రాగంలో చేసిన కొన్ని అన్యస్వరాల ప్రయోగానికి కూడా ఆ ప్రేరణ ఉందని వినికిడి.
జనరంజకత్వం కోసం రాగాలను మిశ్రమం చేసుకునే సౌలభ్యం, చెవికింపుగా ఉండేంతవరకు ఆలాపనలో స్వతంత్ర సంచారం చేసుకునే వీలు - హిందూస్ధానీ సంప్రదాయంలోను, ముఖ్యంగా లలితగీతాల స్వరకల్పనలోను ఉంది. ఈ అవకాశాలన్నింటినీ అలవోకగా అందిపుచ్చుకుని అత్యద్భుతంగా స్వరపరచి - ముందు అనుకున్నట్లుగా - భావాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా తన గళమాధుర్యంతో ప్రేక్షక శ్రోతల హృదయాలను ఈ పాటల ద్వారా రసప్లావితం చేయగలిగారు ఘంటసాల.
ఇక సాహిత్య పరంగా చెప్పాలంటే చెలి, సఖి, మనోహరి, చల్లని సిరి, లహరి, తనివినించు, చంచలవో, మిలమిలవో ఇవన్నీ పింగళి వారి పాళిపై మురిసి, మెరిసిన తళతళలే...
ఈ 'ఎవరివో' పాట ముగియగానే సినిమాలో దుష్టపాత్ర ధరించిన మహానటి సావిత్రి అభినయించిన ఓ స్వరఖండిక వస్తుంది. ఎ.పి.కోమల పాడగా, కళ్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ చరణం సాహిత్యం ఇలా ఉంటుంది.
వలపు పాట వినగానె
నిలవలేక చేరితినోయ్
మనసు పడిన వరాలొసగి
నిను తరింపజేయుదునోయ్
సఖా ఓ సఖా.....
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ