Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,
Song Category : Comedy Songs
Song- Ragam :
I pATanu piThApuraM nAgESvararAvu, bRuMdaM pADagA jOgArAvu, padmanABaM, Sarma(ke.vi.yas.Sarma) aBinayiMcAru. AnaMdaBairavi rAgaM I pATaku AdhAraM. pUrti SAstrIyata toNikisalADE I rAgAnni hAsya, vyaMgya gItAniki upayOgiMcaTaMlO saMgIta darSakuDigA GaMTasAla caturatanu manaM pratyEkaMgA gamaniMcAli. I pATa OpeniMg biT ni, iMTarlUD lani jAgrattagA viMTE 'baMgAru pApa ' lOni 'tAdhimi takadhimi tOlbomma ' pATa gurtuku vastE aMduku kAraNaM AnaMdaBairavi rAgamE! ika sAhitI paraMgA pATalO piMgaLi cEsina gammattulu, visirina ceLukulu eppuDu vinnA, anvayiMcukunnA nitya nUtanaMgA uMTAyi. vyaMgyaM aMTE ilA uMDAli ani anipiMcElA uMTAyi. pATa sAhityAnni padE padE mananaM cEsukuMTE mana cuTTU uMDE vArilOnE bOleDaMta maMdi j~jApakaM vastAru. aMtaTi viSvajanIyata uMdIgItaMlO.
modaTi caraNaM civari vAkyamaina 'jilibili gilibili galibiligA' lO 'galibili ' ni tIsukuni teMDava caraNaM civari vAkyaM ki modaTigA cErci 'galibili gilibili gajibijigA' ani, I vAkyaM civarna unna 'gajibiji ' ni tIsukuni mUDava caraNaM civari vAkyamaina 'gajibiji giji biji giDa baDagA 'ki modaTa cErcaTaM piMgaLi cEsina marO tamAShA.
ఈ పాటను పిఠాపురం నాగేశ్వరరావు, బృందం పాడగా జోగారావు, పద్మనాభం, శర్మ(కె.వి.యస్.శర్మ) అభినయించారు. ఆనందభైరవి రాగం ఈ పాటకు ఆధారం. పూర్తి శాస్త్రీయత తొణికిసలాడే ఈ రాగాన్ని హాస్య, వ్యంగ్య గీతానికి ఉపయోగించటంలో సంగీత దర్శకుడిగా ఘంటసాల చతురతను మనం ప్రత్యేకంగా గమనించాలి. ఈ పాట ఓపెనింగ్ బిట్ ని, ఇంటర్లూడ్ లని జాగ్రత్తగా వింటే 'బంగారు పాప ' లోని 'తాధిమి తకధిమి తోల్బొమ్మ ' పాట గుర్తుకు వస్తే అందుకు కారణం ఆనందభైరవి రాగమే! ఇక సాహితీ పరంగా పాటలో పింగళి చేసిన గమ్మత్తులు, విసిరిన చెళుకులు ఎప్పుడు విన్నా, అన్వయించుకున్నా నిత్య నూతనంగా ఉంటాయి. వ్యంగ్యం అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా ఉంటాయి. పాట సాహిత్యాన్ని పదే పదే మననం చేసుకుంటే మన చుట్టూ ఉండే వారిలోనే బోలెడంత మంది జ్ఞాపకం వస్తారు. అంతటి విశ్వజనీయత ఉందీగీతంలో.
మొదటి చరణం చివరి వాక్యమైన 'జిలిబిలి గిలిబిలి గలిబిలిగా' లో 'గలిబిలి ' ని తీసుకుని తెండవ చరణం చివరి వాక్యం కి మొదటిగా చేర్చి 'గలిబిలి గిలిబిలి గజిబిజిగా' అని, ఈ వాక్యం చివర్న ఉన్న 'గజిబిజి ' ని తీసుకుని మూడవ చరణం చివరి వాక్యమైన 'గజిబిజి గిజి బిజి గిడ బడగా 'కి మొదట చేర్చటం పింగళి చేసిన మరో తమాషా.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ