Actor : Jaggayya / జగ్గయ్య ,
Actress : Jamuna / జమున ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Arudra / ఆరుద్ర ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.suSIla pADagA jamuna aBinayiMciMdi. pATa civarlO perumALLu, vijayalakShmi kanipistAru. I pATa miSrapahADI, yaman rAgacCAyalu kanipistAyi, takkina pATaMtA anyasvarAlatO kalisina pahADI rAgaMtO kanipistuMdi. pahADI rAgAnni upayOgistU peMDyAla 'BAgyarEKa' sinimAlO cEsina 'kannITi kaDalI lOnA' pATanu gurtu cEsukuMTU I 'ciTTi poTTi' pATanu viMTE reMDiTikIgala pOlika telustuMdi. I pATalO gala 'O...O...O' aMTU suSIla tIsina AlApananu poDigiMcukuMTU pOtE adi 'ciraMjIvulu' sinimAlOni 'cikiliMta sogasu' pATalOni AlApanalanu aMdukunE avakASaM uMdi. I pOlika kEvalaM yAdRucCikamE.
ఈ పాటను పి.సుశీల పాడగా జమున అభినయించింది. పాట చివర్లో పెరుమాళ్ళు, విజయలక్ష్మి కనిపిస్తారు. ఈ పాట మిశ్రపహాడీ, యమన్ రాగచ్ఛాయలు కనిపిస్తాయి, తక్కిన పాటంతా అన్యస్వరాలతో కలిసిన పహాడీ రాగంతో కనిపిస్తుంది. పహాడీ రాగాన్ని ఉపయోగిస్తూ పెండ్యాల 'భాగ్యరేఖ' సినిమాలో చేసిన 'కన్నీటి కడలీ లోనా' పాటను గుర్తు చేసుకుంటూ ఈ 'చిట్టి పొట్టి' పాటను వింటే రెండిటికీగల పోలిక తెలుస్తుంది. ఈ పాటలో గల 'ఓ...ఓ...ఓ' అంటూ సుశీల తీసిన ఆలాపనను పొడిగించుకుంటూ పోతే అది 'చిరంజీవులు' సినిమాలోని 'చికిలింత సొగసు' పాటలోని ఆలాపనలను అందుకునే అవకాశం ఉంది. ఈ పోలిక కేవలం యాదృచ్ఛికమే.