This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Muddubidda
Song » Padara Saradagaa / పదరా సరదాగా
Click To Rate




* Voting Result *
100.00 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

  I pATanu jikki pADagA SAMtArAM nirmiMcina 'tIn battI - cAr rAstA' hiMdI citraMlO naTiMci pEru teccukunna mInAkShi aBinayiMciMdi. I pATanu jaggayya, jamuna, nAgayya, lakShmIrAjyaM modalaina vAraMtA itara muKyapAtradhArulatO sahA sannivESa prAdhAnyaMgA kanipistAru. hIrO hIrOyinlaku peLLayina saMdarBaMgA risepShanlAgA ErpATu cEsina O sAMskRutika kAryakramaMlO I nRutyagItaM vastuMdi. iTuvaMTi saMdarBAllO O avuT DOr DyUyeT lEka O SOBanapu pATO joppiMcakuMDA iMcumiMcu citraMlO naTiMcina muKyapAtralaMdarinI okacOTa cErci O nRutyagItAnni cUpiMcaTaM darSaka nirmAta tilak aBiruciki, kamiTmeMTki O pavitra nidarSanaM. 


I pATalO Dappu vAdyAlaku prAdhAnyata uMdi. rikArDiMg samayaMlO maMTa vEsi A maMTallO Dappulanu SRuti cEsukuni rikArDiMguki veLLAru. Dappulu vAyiMcaTaMlO A rOjullO pErennika ganna EsudAsu, amRutayyalanu piliciMci, vAricEtanE vAyiMpajEsi vArE naTiMcETTugA cESAru tilak. ika pATalO kostE madhyamAvati rAgaM pradhAnarAgaMgA malucukuMTU pATanu svaraparicAru peMDyAla.

jAnapada dhOraNilO sAgE I pATa TyUn eMtOmaMdi hRudayAlalO bAgA nATukupOyiMdi. I madhya vaccina ''BAmarO nannE pyAr karO'' (GaTOtkacuDu), ''pOri huShAru guMdirO haiTEmO AruMdirO'' (sIma siMhaM) pATalni I pATatO sahA saMpAdiMci vinagaligitE A nATi A pATa praBAvaM ivvALTiki telugu sinIsaMgItaMpai eMtagA uMdO telustuMdi. I pATalO konni lainlu - okkokkaTi enimidisArlu, ArusArlu, nAlugusArlu ripIT ayinA sarE bOru koTTakuMDA mariMta huShArugA uMDaDaM I pATa pratyEkata.
 
Important information - Telugu

ఈ పాటను జిక్కి పాడగా శాంతారాం నిర్మించిన 'తీన్ బత్తీ - చార్ రాస్తా' హిందీ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న మీనాక్షి అభినయించింది. ఈ పాటను జగ్గయ్య, జమున, నాగయ్య, లక్ష్మీరాజ్యం మొదలైన వారంతా ఇతర ముఖ్యపాత్రధారులతో సహా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. హీరో హీరోయిన్లకు పెళ్ళయిన సందర్భంగా రిసెప్షన్లాగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఈ నృత్యగీతం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఓ అవుట్ డోర్ డ్యూయెట్ లేక ఓ శోభనపు పాటో జొప్పించకుండా ఇంచుమించు చిత్రంలో నటించిన ముఖ్యపాత్రలందరినీ ఒకచోట చేర్చి ఓ నృత్యగీతాన్ని చూపించటం దర్శక నిర్మాత తిలక్ అభిరుచికి, కమిట్మెంట్కి ఓ పవిత్ర నిదర్శనం. 

ఈ పాటలో డప్పు వాద్యాలకు ప్రాధాన్యత ఉంది. రికార్డింగ్ సమయంలో మంట వేసి ఆ మంటల్లో డప్పులను శృతి చేసుకుని రికార్డింగుకి వెళ్ళారు. డప్పులు వాయించటంలో ఆ రోజుల్లో పేరెన్నిక గన్న ఏసుదాసు, అమృతయ్యలను పిలిచించి, వారిచేతనే వాయింపజేసి వారే నటించేట్టుగా చేశారు తిలక్. ఇక పాటలో కొస్తే మధ్యమావతి రాగం ప్రధానరాగంగా మలుచుకుంటూ పాటను స్వరపరిచారు పెండ్యాల.

జానపద ధోరణిలో సాగే ఈ పాట ట్యూన్ ఎంతోమంది హృదయాలలో బాగా నాటుకుపోయింది. ఈ మధ్య వచ్చిన ''భామరో నన్నే ప్యార్ కరో'' (ఘటోత్కచుడు), ''పోరి హుషారు గుందిరో హైటేమో ఆరుందిరో'' (సీమ సింహం) పాటల్ని ఈ పాటతో సహా సంపాదించి వినగలిగితే ఆ నాటి ఆ పాట ప్రభావం ఇవ్వాళ్టికి తెలుగు సినీసంగీతంపై ఎంతగా ఉందో తెలుస్తుంది. ఈ పాటలో కొన్ని లైన్లు - ఒక్కొక్కటి ఎనిమిదిసార్లు, ఆరుసార్లు, నాలుగుసార్లు రిపీట్ అయినా సరే బోరు కొట్టకుండా మరింత హుషారుగా ఉండడం ఈ పాట ప్రత్యేకత.