Actor : NTR / ఎన్ టీ ఆర్ , Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,
Actress : Shavukaru Janaki / షావుకారు జానకి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : Ghantasala / ఘంటసాల , Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Inspiring & Motivational Songs
Song- Ragam :
aByudayAniki addaM paTTE 'vastuMdOy vastuMdi' pATa - goMtulO ninAdaMlA ragilE AvESAniki, guMDellOni nAdaMlA dhvaniMcE caitanyAniki madhyagala vyatyAsAnni kShIranIra nyAyaMlA vEru cEsi cUpi - vicakShaNaku kAvalasina spaMdananu spaShTaMgA aMdiMcagala gItaM. madhyamAvati rAgaMlO svaraparacabaDina I pATanu GaMTasAla, jikki pADagA, nRutyabRuMdaMtO rElaMgi aBinayiMcAru. 'rOjulu mArAyi' citraMlOni 'EruvAka sAgArO rannO cinnanna' pATa naDaka I pATalO koddigA kanipiMcinA A praBAvaM I pATa svaBAvaMtO pUrtigA odigipOyiMdi.
అభ్యుదయానికి అద్దం పట్టే 'వస్తుందోయ్ వస్తుంది' పాట - గొంతులో నినాదంలా రగిలే ఆవేశానికి, గుండెల్లోని నాదంలా ధ్వనించే చైతన్యానికి మధ్యగల వ్యత్యాసాన్ని క్షీరనీర న్యాయంలా వేరు చేసి చూపి - విచక్షణకు కావలసిన స్పందనను స్పష్టంగా అందించగల గీతం. మధ్యమావతి రాగంలో స్వరపరచబడిన ఈ పాటను ఘంటసాల, జిక్కి పాడగా, నృత్యబృందంతో రేలంగి అభినయించారు. 'రోజులు మారాయి' చిత్రంలోని 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' పాట నడక ఈ పాటలో కొద్దిగా కనిపించినా ఆ ప్రభావం ఈ పాట స్వభావంతో పూర్తిగా ఒదిగిపోయింది.
ఈ పాటలోని 'తుఫాను రూపై ధూముధూముధాములతో', 'గర్భదరిద్రులనుద్దరించుటకు', అనే వాక్యాలు వింటున్నప్పుడు 'గుండమ్మ కథ' చిత్రంలోని 'లేచింది నిద్రలేచింది' పాటలోని 'ఇప్పుడే చెబుతా యినుకో బుల్లెమ్మా' అనే వాక్యం ట్యూన్ పరంగా గుర్తుకు వస్తుంది. అంతేకాదు ఈ పాటని ఇవాళ మళ్ళీ విని అవగాహన చేసుకోగలిగితే 'బీచ్ అండ్ మెలొడీ విత్ లిరికల్ బ్యూటీ' అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఈ పాట రచన కూడా కొసరాజే.