This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Donga-Ramudu
Song » Ravoyi maa intiki / రావోయి మా ఇంటికి
Click To Rate




* Voting Result *
0 %
0 %
20.00 %
0 %
80.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 


'rAvOy mA iMTiki' pATanu jikki pADagA terapai sAvitri, Ar.nAgESvararAvu aBinayiMcAru. I pATalO marO puruSha kaMThaM kUDA vinipistuMdi. A mATalanu Ar nAgESvararAvu palikEranukunEvALLu ippaTikI unnAru. nijAniki A kaMThaM maddAli kRuShNamUrti anE O naTunidi. aMta goppagA palikArAyana A tAguDu mATalanu.

I pATaki peMDyAla vAru cAlA telivigA hiMdustAnI saMpradAyaMlOni mujrAlalO SRuMgArapUritamaina AhvAnaM vaSIkaraNaM paddhatilO dhvanistU uMTuMdi. O rakamaina Upu, mattu uMTAyi. avannI I pATa svaBAvAniki saripOyAyi. I pATa myUjik siTTiMgslO tAgina vADi nOTiki Evi rucistAyO avi udaharistE bAguMTuMdanna salahA rAvaDaMtO samudrAla vAru peMDyAla gArini aDigAraTa....'orE... nAgESvararAvu...kODikUra aMTAru kadA... adelA uMTuMdirA?' ani. peMDyAla gAru 'nAkaMtagA anuBavaM lEdaMDi' annAraTa.

civaraku ArT DairekTar kRuShNArAvugArini aDigitE - arakODi kUra, royyipoTTu cAru brahmAMDaMgA uMTAyani ceppAraTa. appuDA reMDiTinI reMDO caraNaMlO advitIyaMgA joppiMci aMdarnI meppiMcAru sadrBAhmaNuDaina samudrAla rAGavAcArya. ika terapai citrIkaraNa paraMgA I pATa eMta bAgA rakti kaTTiMdaMTE 'appuDu Ar. nAgESvararAvu dorikipOyADu sAvitri cEjikki - eMdukaMTE akkaDa adButaMgA pADiMdi gAyani jikki' aMTU koMdaru kavitAtmakaMgA ceppukunEvAru ArOjullO.
Important information - Telugu

 'రావోయ్ మా ఇంటికి' పాటను జిక్కి పాడగా తెరపై సావిత్రి, ఆర్.నాగేశ్వరరావు అభినయించారు. ఈ పాటలో మరో పురుష కంఠం కూడా వినిపిస్తుంది. ఆ మాటలను ఆర్ నాగేశ్వరరావు పలికేరనుకునేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నిజానికి ఆ కంఠం మద్దాలి కృష్ణమూర్తి అనే ఓ నటునిది. అంత గొప్పగా పలికారాయన ఆ తాగుడు మాటలను.


ఈ పాటకి పెండ్యాల వారు చాలా తెలివిగా హిందుస్తానీ సంప్రదాయంలోని ముజ్రాలలో శృంగారపూరితమైన ఆహ్వానం వశీకరణం పద్ధతిలో ధ్వనిస్తూ ఉంటుంది. ఓ రకమైన ఊపు, మత్తు ఉంటాయి. అవన్నీ ఈ పాట స్వభావానికి సరిపోయాయి. ఈ పాట మ్యూజిక్ సిట్టింగ్స్లో తాగిన వాడి నోటికి ఏవి రుచిస్తాయో అవి ఉదహరిస్తే బాగుంటుందన్న సలహా రావడంతో సముద్రాల వారు పెండ్యాల గారిని అడిగారట....'ఒరే... నాగేశ్వరరావు...కోడికూర అంటారు కదా... అదెలా ఉంటుందిరా?' అని. పెండ్యాల గారు 'నాకంతగా అనుభవం లేదండి' అన్నారట.

చివరకు ఆర్ట్ డైరెక్టర్ కృష్ణారావుగారిని అడిగితే - అరకోడి కూర, రొయ్యిపొట్టు చారు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారట. అప్పుడా రెండిటినీ రెండో చరణంలో అద్వితీయంగా జొప్పించి అందర్నీ మెప్పించారు సద్ర్భాహ్మణుడైన సముద్రాల రాఘవాచార్య. ఇక తెరపై చిత్రీకరణ పరంగా ఈ పాట ఎంత బాగా రక్తి కట్టిందంటే 'అప్పుడు ఆర్. నాగేశ్వరరావు దొరికిపోయాడు సావిత్రి చేజిక్కి - ఎందుకంటే అక్కడ అద్భుతంగా పాడింది గాయని జిక్కి' అంటూ కొందరు కవితాత్మకంగా చెప్పుకునేవారు ఆరోజుల్లో.