Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu jikki, bRuMdaM pADagA padmini priyadarSini grUp DAnsarlatO aBinayiMciMdi. sannivESa prAdhAnyaMgA en.Ti.Ar, sAvitri kUDA aBinayaMlO pAlupaMcukuMTAru. ikkaDa O reMDu mUDu viShayAlni prastAviMci tIrAli. I citrAniki mAtRuka ayina baDI behan (1949)lO 'cup cup KaDe hO jarUr koyi bAt hai' anE pATa lata, prEm lata kalisi pADinadi uMdi. A pATa A rOjullO eMtagA hiT ayiMdaMTE - E.vi.yaM vAri 'jIvitaM' sinimAlO 'Tikku Tikku TakkulADi' anE pallavitO yathAtathaMgA tIsukOka tappadanETaMta sthAyilO hiT ayiMdaMTE - E.vi.yaM. vAri 'jIvitaM' sinimAlO 'Tikku Tikku TakkulADi' anE pallavi yathatathaMgA tIsukOka tappadanETaMta sthAyilO hiT ayiMdi.
telugu verShan 'BalE ammAyilu' sinimAkoccEsariki A sannivESAniki A hiMdI orijinal pATa plEslO telugu pATa iMkokaTi cEsi tIraka tappadu. aTuvaMTi paristhitullO rAjESvararAvu sRuShTiMcina pATa -'cak cak JaNatA'! mOhanarAgAnni avasaraM ayina cOTa miSramaM cEsukuMTU Ayana I pATanu eMta dhITugA svaraparicArO telusukOvAlaMTE orijinal sinimAlOni 'cup cup KaDEhO' pATani 'cak cak JaNtA'! pATani pakka pakkana peTTukuni viMTE telustuMdi.
marO viShayaM EmiTaMTE - I pATalO 'sUdaMTu rAyale lAgutunnadi - vAlucUpultO lOkulni Uputunnadi' anE lainukanna TyUnni ippuDu ganuka viMTE rAjEvvararAvugArabbAyi kOTi 'pedarAyuDu' sinimA kOsaM cEsina 'abba dIni sOku cUsi vaccA vaccA' anE pATa pallavi gurtostuMdi.
ఈ పాటను జిక్కి, బృందం పాడగా పద్మిని ప్రియదర్శిని గ్రూప్ డాన్సర్లతో అభినయించింది. సన్నివేశ ప్రాధాన్యంగా ఎన్.టి.ఆర్, సావిత్రి కూడా అభినయంలో పాలుపంచుకుంటారు. ఇక్కడ ఓ రెండు మూడు విషయాల్ని ప్రస్తావించి తీరాలి. ఈ చిత్రానికి మాతృక అయిన బడీ బెహన్ (1949)లో 'చుప్ చుప్ ఖడె హో జరూర్ కొయి బాత్ హై' అనే పాట లత, ప్రేమ్ లత కలిసి పాడినది ఉంది. ఆ పాట ఆ రోజుల్లో ఎంతగా హిట్ అయిందంటే - ఏ.వి.యం వారి 'జీవితం' సినిమాలో 'టిక్కు టిక్కు టక్కులాడి' అనే పల్లవితో యథాతథంగా తీసుకోక తప్పదనేటంత స్థాయిలో హిట్ అయిందంటే - ఏ.వి.యం. వారి 'జీవితం' సినిమాలో 'టిక్కు టిక్కు టక్కులాడి' అనే పల్లవి యథతథంగా తీసుకోక తప్పదనేటంత స్థాయిలో హిట్ అయింది.
తెలుగు వెర్షన్ 'భలే అమ్మాయిలు' సినిమాకొచ్చేసరికి ఆ సన్నివేశానికి ఆ హిందీ ఒరిజినల్ పాట ప్లేస్‌లో తెలుగు పాట ఇంకొకటి చేసి తీరక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో రాజేశ్వరరావు సృష్టించిన పాట -'చక్ చక్ ఝణతా'! మోహనరాగాన్ని అవసరం అయిన చోట మిశ్రమం చేసుకుంటూ ఆయన ఈ పాటను ఎంత ధీటుగా స్వరపరిచారో తెలుసుకోవాలంటే ఒరిజినల్ సినిమాలోని 'చుప్ చుప్ ఖడేహో' పాటని 'చక్ చక్ ఝణ్తా'! పాటని పక్క పక్కన పెట్టుకుని వింటే తెలుస్తుంది.
మరో విషయం ఏమిటంటే - ఈ పాటలో 'సూదంటు రాయలె లాగుతున్నది - వాలుచూపుల్తో లోకుల్ని ఊపుతున్నది' అనే లైనుకన్న ట్యూన్‌ని ఇప్పుడు గనుక వింటే రాజేవ్వరరావుగారబ్బాయి కోటి 'పెదరాయుడు' సినిమా కోసం చేసిన 'అబ్బ దీని సోకు చూసి వచ్చా వచ్చా' అనే పాట పల్లవి గుర్తొస్తుంది.