This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Anarkali
Song » Jeevitame Sphalam / జీవితమే సఫలము
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 BIMplAs rAgaMlO svaraparacabaDina 'jIvitamE saPalamu' pATani hiMdI anArkalIlOni 'yE jiMdakI usIkI hai' pATaki anusaraNagA ceppukOvAli. ikkaDa muKyaMgA ceppukOvalasiMdi AdinArAyaNarAvugAri pratiBa. I pATaku hiMdI mAtRukaku pOlikatO pATu cAlA sUkShmamaina vyatyAsAlu unnAyi. avi reMDu pATalanu daggaragA peTTukuni sAdhana cEsina vAriki nOTEShansu (svarAlu) rAyaTaM telisina vAriki mAtramE avagAhanalOki vastuMdi.


sAhityaparaMgA cUstE 'jIvitamE saPalamu' pATa modaTa caraNaMlO 'varAla sOyagAla priyula' anE pada prayOgaM koMdari dRuShTilO paDiMdi. priyuni anakuMDA priyula ani bahuvacanaM vADaDaM paTla kiMcittu noccukOvaDaM kUDA jarigiMdi. ayitE A pATa sRuShTikarta kalaM vyartha prayOgAlu cEsEdi kAdu. adi reMDO caraNaMlO 'variMcu BAgyaSAlulA' anE vAkyaM cUstE arthamayipOtuMdi. ikkaDa kavi ceppAlanukunnadi evari jIvitamu saPalamO teliyajEyaTamE. kanuka aTuvaMTi samayaMlO prEmikula anE arthaMtO priyula anE padAnni tIsukuMTE saripOtuMdi. jikkI pADina I pATanu aBinayiMciMdi aMjalIdEvi.

 

Important information - Telugu

 భీంప్లాస్ రాగంలో స్వరపరచబడిన 'జీవితమే సఫలము' పాటని హిందీ అనార్కలీలోని 'యే జిందకీ ఉసీకీ హై' పాటకి అనుసరణగా చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఆదినారాయణరావుగారి ప్రతిభ. ఈ పాటకు హిందీ మాతృకకు పోలికతో పాటు చాలా సూక్ష్మమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అవి రెండు పాటలను దగ్గరగా పెట్టుకుని సాధన చేసిన వారికి నోటేషన్సు (స్వరాలు) రాయటం తెలిసిన వారికి మాత్రమే అవగాహనలోకి వస్తుంది.


సాహిత్యపరంగా చూస్తే 'జీవితమే సఫలము' పాట మొదట చరణంలో 'వరాల సోయగాల ప్రియుల' అనే పద ప్రయోగం కొందరి దృష్టిలో పడింది. ప్రియుని అనకుండా ప్రియుల అని బహువచనం వాడడం పట్ల కించిత్తు నొచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ఆ పాట సృష్టికర్త కలం వ్యర్థ ప్రయోగాలు చేసేది కాదు. అది రెండో చరణంలో 'వరించు భాగ్యశాలులా' అనే వాక్యం చూస్తే అర్థమయిపోతుంది. ఇక్కడ కవి చెప్పాలనుకున్నది ఎవరి జీవితము సఫలమో తెలియజేయటమే. కనుక అటువంటి సమయంలో ప్రేమికుల అనే అర్థంతో ప్రియుల అనే పదాన్ని తీసుకుంటే సరిపోతుంది. జిక్కీ పాడిన ఈ పాటను అభినయించింది అంజలీదేవి.