This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Kaalahasthi-Mahathyam
Song » Madhuram / మధురము
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

maroka goppa pATa idi. trAsulO uMDE sUcikagA sAhityAnni BAviMci saMgItAnni,  gAnAnni, cerOvaipu uMcitE samatUkaMlO tUgEpATa idi. 'iha parasAdhanamE' anE  vAkyAnni ayidusArlu rakarakAlugA svaraparacaTaMlOnu, pADaDaMlOnu aTu  sudarvanaM iTu GaMTasAla - AdhyAtmika anuBUtiki saMgItaM eMtagA dOhadaM  cEstuMdO Rujuvu cEsi cUpiMcAru. alAgE 'pAlanu muMcedavO' daggara 'O^^O^^O' aMTU  GaMTasAla AlapiMcina tIruki gagurpATu ceMdani guMDeni hRudayaM anaTAniki  vIllEdu. I pATanu yadhAtatha rasaBAvAlatO pADagaligina E gAyakuDainA E sinI saMgIta  pOTIlOnainA bahumati gelucukuMTADu.

I pATalO - 'madhuramu Siva maMtramu' nuMci 'surucita tArakamE' varaku siMdhuBairavi  rAgAnni 'Agama saMcAra' nuMci 'nannu kAnagarAvayyA' dAkA SuBapaMtuvarALi  rAgAnni varALi rAgAnni, 'pAlanu muMcedavO' daggarnuMci 'nI pAdamu viDanayyA'  varaku sAmarAgAnni, 'kAruNya guNa sAgarA' daggarnuMci 'kApADavA SaMkarA' varaku  kAmavarthini rAgAnni upayOgiMcAru. okkasAri I pATanu svaMtaM cEsukoni cUDaMDi.  saMgIta sAgaraMlO IdaTaM telisipOyinaMta BAvana kaligi tIrutuMdi.

Important information - Telugu

మరొక గొప్ప పాట ఇది. త్రాసులో ఉండే సూచికగా సాహిత్యాన్ని భావించి సంగీతాన్ని, గానాన్ని, చెరోవైపు ఉంచితే సమతూకంలో తూగేపాట ఇది. 'ఇహ పరసాధనమే' అనే వాక్యాన్ని అయిదుసార్లు రకరకాలుగా స్వరపరచటంలోను, పాడడంలోను అటు సుదర్వనం ఇటు ఘంటసాల - ఆధ్యాత్మిక అనుభూతికి సంగీతం ఎంతగా దోహదం చేస్తుందో ఋజువు చేసి చూపించారు. అలాగే 'పాలను ముంచెదవో' దగ్గర 'ఓఓఓ' అంటూ ఘంటసాల ఆలపించిన తీరుకి గగుర్పాటు చెందని గుండెని హృదయం అనటానికి వీల్లేదు. ఈ పాటను యధాతథ రసభావాలతో పాడగలిగిన ఏ గాయకుడైనా ఏ సినీ సంగీత పోటీలోనైనా బహుమతి గెలుచుకుంటాడు.

ఈ పాటలో - 'మధురము శివ మంత్రము' నుంచి 'సురుచిత తారకమే' వరకు సింధుభైరవి రాగాన్ని 'ఆగమ సంచార' నుంచి 'నన్ను కానగరావయ్యా' దాకా శుభపంతువరాళి రాగాన్ని వరాళి రాగాన్ని, 'పాలను ముంచెదవో' దగ్గర్నుంచి 'నీ పాదము విడనయ్యా' వరకు సామరాగాన్ని, 'కారుణ్య గుణ సాగరా' దగ్గర్నుంచి 'కాపాడవా శంకరా' వరకు కామవర్థిని రాగాన్ని ఉపయోగించారు. ఒక్కసారి ఈ పాటను స్వంతం చేసుకొని చూడండి. సంగీత సాగరంలో ఈదటం తెలిసిపోయినంత భావన కలిగి తీరుతుంది.