This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Kaalahasthi-Mahathyam
Song » Dhanyudanaitini devadevaa / ధన్యుడనైతిని దేవదేవా
Click To Rate




* Voting Result *
100.00 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATa ShaNmuKapriyarAgaMlO svaraparacabaDiMdi. tarvAta vaccE padyAniki SaMkarABaraNaM  rAgaMlOni svarAlanu tIsukuni svataMtra saMcAraM cEstU svaraparacaDaM jarigiMdi.

I pATalu, padyAlanniTikI rAjkumAr iccina aBinayAnni ivALa cUDagaligitE tana  mAtRuBASha kAkapOyinA telugulO iMtaTi kliShTa sAhityAniki... sinI kaLAkAruDugA idi  Ayanaku modaTi citramainA sarE... Ayana iccina lip mUmeMTni cUstE karNATaka  rAShTraM eMduku Ayanni mahAnaTuDigA gauraviMci nettina peTTukuMdO - vIrappan  Ayanni apaharistE (riTairaipOyina tarvAta kUDA) kannaDa sinIraMgaM ShUTiMgulu  ApivEsi eMduku staMBiMcipOyiMdO arthaM avutuMdi.

ivALa ati tElikaina mATalakkUDA lip mUmeMTni kanIkanipiMcani rItilO - lAMg ShATlalO - kaLLu cedirE  lokEShanslO - sTeppula madhya - mEnEj cEsEsukuMTunna vAraMtA okkasAri I citraMlO  rAjkumAr naTana cUstE cAlu. tarvAta dAnni oka silabaslA svIkariMcAlani  anipiMci tIrutuMdi. saMgItaparaMgA civaragA okkamATalO ceppAlaMTE - I citraMlOni  pATanu padyAlanu paMtaM paTTinaTlugA rAkShasa sAdhana cEsainA sarE sAdhiMcitE konni  rAgAlapai koMceM paTTunu saMpAdiMcagaliginaTlE.

Important information - Telugu

ఈ పాట షణ్ముఖప్రియరాగంలో స్వరపరచబడింది. తర్వాత వచ్చే పద్యానికి శంకరాభరణం రాగంలోని స్వరాలను తీసుకుని స్వతంత్ర సంచారం చేస్తూ స్వరపరచడం జరిగింది.
ఈ పాటలు, పద్యాలన్నిటికీ రాజ్కుమార్ ఇచ్చిన అభినయాన్ని ఇవాళ చూడగలిగితే తన మాతృభాష కాకపోయినా తెలుగులో ఇంతటి క్లిష్ట సాహిత్యానికి... సినీ కళాకారుడుగా ఇది ఆయనకు మొదటి చిత్రమైనా సరే... ఆయన ఇచ్చిన లిప్ మూమెంట్ని చూస్తే కర్ణాటక రాష్ట్రం ఎందుకు ఆయన్ని మహానటుడిగా గౌరవించి నెత్తిన పెట్టుకుందో - వీరప్పన్ ఆయన్ని అపహరిస్తే (రిటైరైపోయిన తర్వాత కూడా) కన్నడ సినీరంగం షూటింగులు ఆపివేసి ఎందుకు స్తంభించిపోయిందో అర్థం అవుతుంది.

ఇవాళ అతి తేలికైన మాటలక్కూడా లిప్ మూమెంట్ని కనీకనిపించని రీతిలో - లాంగ్ షాట్లలో - కళ్ళు చెదిరే లొకేషన్స్లో - స్టెప్పుల మధ్య - మేనేజ్ చేసేసుకుంటున్న వారంతా ఒక్కసారి ఈ చిత్రంలో రాజ్కుమార్ నటన చూస్తే చాలు. తర్వాత దాన్ని ఒక సిలబస్లా స్వీకరించాలని అనిపించి తీరుతుంది. సంగీతపరంగా చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే - ఈ చిత్రంలోని పాటను పద్యాలను పంతం పట్టినట్లుగా రాక్షస సాధన చేసైనా సరే సాధించితే కొన్ని రాగాలపై కొంచెం పట్టును సంపాదించగలిగినట్లే.