This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Thodikodallu-
Song » Adutu Padutu / ఆడుతు పాడుతు
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

cElaku nILLanu aMdiMcaTAniki 'gUDa' vEsE paddhatini ADutu pADutu pATalO cUpiMcAru. A mUmeMTku taggaTTugA POk myUjikni bEs cEsukuni rithamni 2/4lO aMTE caturasraMlO seT cEsukuni marOvaipu aMdamaina O praNaya gItaMlA kUDA rUpoMdistU 'panIpATA' anE nAnuDiki addaMpaTTi arthaM ceppE vidhaMgA nirmAta, darSakuDu, racayita, saMgIta darSakuDu, gAyanI gAyakulu, naTInaTulu, taditara sAMkEtika bRuMdaM aMtA kalsi cEsina samiShTi kRuShi pATaMtA kanipistuMdi. - gUDavEsE paddhati tappa marO mUmeMT lEni I pATanu monATanI anipiMcani rItilO - tIrcididdukunna tIrucUstE A rOjullO unnadEmiTO, IrOjullO koravaDutunnadEmiTO araTipaMDu cEtilO olici peTTinaTTu telisi pOtuMdi.

vyavasAya kuTuMbaM nuMci vaccina akkinEni eMtO suluvugA gUDa vEstU cEsE aBinayAniki dhITugA uMDaTAniki sAvitri O mUDu rOjula pATu akkinEni SikShaNalO sAdhana cEsiMdani I saMdarBaMgA pratyEkiMci ceppaka tappadu. CAnalslO prasAraM ayinapuDugAni, si.Di. teccukuni cUsinapuDugAni gamaniMcaMDi. akkinEni, sAvitri kalisi gUDavEsE 'DairekT ShAT' lalO kanIsaM 49 nuMci 50 sArlaku paigA vAriddarU gUDavEyaTaM kanipistuMdi. pATanu, lip mUmeMTlanu lAMg ShATlO mAnEj cEyiMcEsukunE kaLAkArula dRuShTiki rAvalasina satyamidi.

ikkaDa iMkO viShayaM kUDA uMdi. jAgrattagA I pATa AlapiMcukuMTU pOtE bAgA telisinavAriki nauShAd svarakalpana cEsE paddhati manasulO  medulutuMdi. nauShAd vadda gulAM mahammad (pakIjA saMgIta darSakuDu) vaMTi vAru saitaM SiShyarikaM cEsinA Ayana sTayilni aMdipuccukOlEkapOyArani adi kEvalaM okka mAsTar vENukE  sAdhyapaDiMdani osAri nauShAdE aMgIkariMcAraTa. I pATa civari caraNaMlO A mudra cAlAvaraku toMgicUDADAnni manaM gamaniMcavaccu. I pATanu kosarAju vrAyagA GaMTasAla, suSIla AlapiMcAru.

Important information - Telugu

చేలకు నీళ్ళను అందించటానికి 'గూడ' వేసే పద్ధతిని ఆడుతు పాడుతు పాటలో చూపించారు. ఆ మూమెంట్కు తగ్గట్టుగా ఫోక్ మ్యూజిక్ని బేస్ చేసుకుని రిథమ్ని 2/4లో అంటే చతురస్రంలో సెట్ చేసుకుని మరోవైపు అందమైన ఓ ప్రణయ గీతంలా కూడా రూపొందిస్తూ 'పనీపాటా' అనే నానుడికి అద్దంపట్టి అర్థం చెప్పే విధంగా నిర్మాత, దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడు, గాయనీ గాయకులు, నటీనటులు, తదితర సాంకేతిక బృందం అంతా కల్సి చేసిన సమిష్టి కృషి పాటంతా కనిపిస్తుంది. - గూడవేసే పద్ధతి తప్ప మరో మూమెంట్ లేని ఈ పాటను మొనాటనీ అనిపించని రీతిలో - తీర్చిదిద్దుకున్న తీరుచూస్తే ఆ రోజుల్లో ఉన్నదేమిటో, ఈరోజుల్లో కొరవడుతున్నదేమిటో అరటిపండు చేతిలో ఒలిచి పెట్టినట్టు తెలిసి పోతుంది.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని ఎంతో సులువుగా గూడ వేస్తూ చేసే అభినయానికి ధీటుగా ఉండటానికి సావిత్రి ఓ మూడు రోజుల పాటు అక్కినేని శిక్షణలో సాధన చేసిందని ఈ సందర్భంగా ప్రత్యేకించి చెప్పక తప్పదు. ఛానల్స్లో ప్రసారం అయినపుడుగాని, సి.డి. తెచ్చుకుని చూసినపుడుగాని గమనించండి. అక్కినేని, సావిత్రి కలిసి గూడవేసే 'డైరెక్ట్ షాట్' లలో కనీసం 49 నుంచి 50 సార్లకు పైగా వారిద్దరూ గూడవేయటం కనిపిస్తుంది. పాటను, లిప్ మూమెంట్లను లాంగ్ షాట్లో మానేజ్ చేయించేసుకునే కళాకారుల దృష్టికి రావలసిన సత్యమిది.

ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. జాగ్రత్తగా ఈ పాట ఆలపించుకుంటూ పోతే బాగా తెలిసినవారికి నౌషాద్ స్వరకల్పన చేసే పద్ధతి మనసులో  మెదులుతుంది. నౌషాద్ వద్ద గులాం మహమ్మద్ (పకీజా సంగీత దర్శకుడు) వంటి వారు సైతం శిష్యరికం చేసినా ఆయన స్టయిల్ని అందిపుచ్చుకోలేకపోయారని అది కేవలం ఒక్క మాస్టర్ వేణుకే  సాధ్యపడిందని ఒసారి నౌషాదే అంగీకరించారట. ఈ పాట చివరి చరణంలో ఆ ముద్ర చాలావరకు తొంగిచూడాడాన్ని మనం గమనించవచ్చు. ఈ పాటను కొసరాజు వ్రాయగా ఘంటసాల, సుశీల ఆలపించారు.