Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Ghantasala / ఘంటసాల , P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATa nijaMgA O rasAtmaka gItaM. peMDyAla guMDellO UpiripOsukunna svarAniki suSIla, GaMTasAla jIva caitanyAnni kalabeTTina gItamidi. lInamai AlapiMcukuMTU pOtE kaMTiporalalO O cemariMpunu, tadanuguNamaina AtmAnaMdAnni kaligiMcagaligE svararacana idi. bRuMdAvana sAraMga rAgaMlO svaraparacabaDina I gItaM grahaBEdaM valla tillaMg rAgaM ani anipiMcE avakASaM kUDA uMdi. enTI^^Ar, sAvitri aBinayiMcina I pATanu raciMcina AtrEya guriMci cAlA ceppAlI saMdarBaMgA...
tanu prEmiMcinavADu manmadhuDA (valarAjA)... mari kaLLaku kanabaDutunnADE!?,,,, pOnI caMdruDA (kaluvarAjA)... jiMka cihnaM maccagA gala caMdruni (hariNAMkuDu) lAMTivADu kAdE.. maccalEni vADu (akalaMkuDu) kadA nA priyuDu - anE arthaM vaccETlu unna reMDO caraNaM AtrEya eMta goppaBAvakuDO teluputuMdi. ayitE, nANEniki reMDOvaipu annaTTu - pAtrala aucityaM prakAraM AlOcistE - SrInivAsuDigA avatariMcina SrI mahAviShNuvuni atanikannA sthAyilO cinnavAraina caMdrunitOnU, manmadhunitOnU pOlcaDaM, Ayana guMDelapai unna SrIvatsava cihnaM guriMci maricipOyi akalaMkuDu ani varNiMcaDaM - ivannI vimarSalaku tAviccE aMSAlu ayitE, iMdulO kUDA AtrEya pakShAna vAdiMcAlaMTE A SrInivAsuDu SrI mahAviShNuvani telIka kadA 'evarO atanevarO' ani I padmAvati paDukunnadi... ayinA, arayaka hRudayaM arpiMcina vAriki tama priyulu akalaMkulugAnE kanipistAru kadA! ani samarthiMcukOvaccu. Edi^^EmainA, aMtaTi AlOcana, aMtaTi aMtarmadhanaM, aMtaTi aMtarmuKatvaM - rAsina vAriki, vinnavAriki kUDA kaligistunnAyi kanukanE A nATi pATalu InATikI sAhitI maryAdalanu aMdukuMTunnAyi.
'karuNanu cUpi kaburu telipi' anE vAkyaMlO 'kaburu' nE urdU padAnni vADinaMduku I pATa rikArDiMg ayipOyAka gurtocci, viparItaMgA kalavarapaDDAraTa AtrEya. gurutulyuDU mallAdi rAmakRuShNaSAstri daggara tana bAdhanu veLLabOsukuMTE 'EM ParvAlEdulE... A kAlaMlO bIbI nAMcAri kUDA uMdigA' aMTU Ayana UraDiMcAka gAni nidrapaTTalEdaTa AtrEyaki. anukunna pani pUrtayipOyi, avasaraM tIripOyina tarvAta nAdEM pOyiMdilE aMTU cEtulu dulipEsukOkuMDA - bAdhyatanu nettina vEsukuni Atma kShOBanu svIkariMcagaligE aTuvaMTi nijAyitIyE cEsE pratipanikI sArthakatanu prasAdiMcEdi.
ఈ పాట నిజంగా ఓ రసాత్మక గీతం. పెండ్యాల గుండెల్లో ఊపిరిపోసుకున్న స్వరానికి సుశీల, ఘంటసాల జీవ చైతన్యాన్ని కలబెట్టిన గీతమిది. లీనమై ఆలపించుకుంటూ పోతే కంటిపొరలలో ఓ చెమరింపును, తదనుగుణమైన ఆత్మానందాన్ని కలిగించగలిగే స్వరరచన ఇది. బృందావన సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ గీతం గ్రహభేదం వల్ల తిల్లంగ్ రాగం అని అనిపించే అవకాశం కూడా ఉంది. ఎన్టీఆర్, సావిత్రి అభినయించిన ఈ పాటను రచించిన ఆత్రేయ గురించి చాలా చెప్పాలీ సందర్భంగా...
తను ప్రేమించినవాడు మన్మధుడా (వలరాజా)... మరి కళ్ళకు కనబడుతున్నాడే!?,,,, పోనీ చంద్రుడా (కలువరాజా)... జింక చిహ్నం మచ్చగా గల చంద్రుని (హరిణాంకుడు) లాంటివాడు కాదే.. మచ్చలేని వాడు (అకలంకుడు) కదా నా ప్రియుడు - అనే అర్థం వచ్చేట్లు ఉన్న రెండో చరణం ఆత్రేయ ఎంత గొప్పభావకుడో తెలుపుతుంది. అయితే, నాణేనికి రెండోవైపు అన్నట్టు - పాత్రల ఔచిత్యం ప్రకారం ఆలోచిస్తే - శ్రీనివాసుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువుని అతనికన్నా స్థాయిలో చిన్నవారైన చంద్రునితోనూ, మన్మధునితోనూ పోల్చడం, ఆయన గుండెలపై ఉన్న శ్రీవత్సవ చిహ్నం గురించి మరిచిపోయి అకలంకుడు అని వర్ణించడం - ఇవన్నీ విమర్శలకు తావిచ్చే అంశాలు అయితే, ఇందులో కూడా ఆత్రేయ పక్షాన వాదించాలంటే ఆ శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువని తెలీక కదా 'ఎవరో అతనెవరో' అని ఈ పద్మావతి పడుకున్నది... అయినా, అరయక హృదయం అర్పించిన వారికి తమ ప్రియులు అకలంకులుగానే కనిపిస్తారు కదా! అని సమర్థించుకోవచ్చు. ఏదిఏమైనా, అంతటి ఆలోచన, అంతటి అంతర్మధనం, అంతటి అంతర్ముఖత్వం - రాసిన వారికి, విన్నవారికి కూడా కలిగిస్తున్నాయి కనుకనే ఆ నాటి పాటలు ఈనాటికీ సాహితీ మర్యాదలను అందుకుంటున్నాయి.
'కరుణను చూపి కబురు తెలిపి' అనే వాక్యంలో 'కబురు' నే ఉర్దూ పదాన్ని వాడినందుకు ఈ పాట రికార్డింగ్ అయిపోయాక గుర్తొచ్చి, విపరీతంగా కలవరపడ్డారట ఆత్రేయ. గురుతుల్యుడూ మల్లాది రామకృష్ణశాస్త్రి దగ్గర తన బాధను వెళ్ళబోసుకుంటే 'ఏం ఫర్వాలేదులే... ఆ కాలంలో బీబీ నాంచారి కూడా ఉందిగా' అంటూ ఆయన ఊరడించాక గాని నిద్రపట్టలేదట ఆత్రేయకి. అనుకున్న పని పూర్తయిపోయి, అవసరం తీరిపోయిన తర్వాత నాదేం పోయిందిలే అంటూ చేతులు దులిపేసుకోకుండా - బాధ్యతను నెత్తిన వేసుకుని ఆత్మ క్షోభను స్వీకరించగలిగే అటువంటి నిజాయితీయే చేసే ప్రతిపనికీ సార్థకతను ప్రసాదించేది.