This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sarangadhara
Song » Annana...Bhamine... / అన్నానా... భామినీ...
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu GaMTasAla, pi.lIla gAnaM cEyagA en.Ti.Ar, rAjasulOcana aBinayiMcAru. sAhityaparaMgA samudrAla sIniyar kotta pOkaDalu pOyArI gItaMlO. manasulO anukunnadaMtA Ovaipu teliyajEstUnE marOvaipu 'Adamaraci epuDainA annAnA',  'mATa varasa kepuDainA annAnA' ani cilipigA tappiMcukuMTU eduTivArini ATapaTTiMcukOvaDaM vaMTi prakriya prEmikula madhya cAlA AkarShaNIyaMgA, tamAShAgA uMTuMdi. A spaMdananu samatUkaMtO aMdiMcaTaMlO samudrAla - sIniyarnani anipiMcukunnAru. saMgIta darSakunigA GaMTasAla I pATanu svaraparacina tIru pratyEkiMci pErkonadaginadi.

1948lO madrAsu vacci kaccErI iccina uttarAdi vidvAMsuDu baDE gulAM AlIKAn praBAvaM GaMTasAlapai eMtagAnO uMdani 'caMdrahAraM' citraMlOni 'idi nA celi' pATa viSlEShaNalO prastAviMcaDaM jarigiMdi. baDEgulAM AlIKAn prEraNagA hiMdUsthAnI saMgItaM nuMci tIsukunna rAgESvari rAgaMtO GaMTasAla eMtagA praBAvitulayyArO marOsAri cebutuMdI 'annAnA BAmini' pATa. virAmAlu pATalO uMTE manasuki rilIP eMta cakkagA laBistuMdO telusukOvAlaMTE I pATanu viMTE cAlu. mATa varusakepuDainA annAnA, Adamaraci epuDainA annAnnA vAkyAla vadda layani pUrtigA ApEsi DailAg PArmlO A lainlani rAgayuktaMgA palikiMcaTaMlO rasOtpatti eMtagA paMDiMdO anuBavaikavEdyamE tappa varNiMcalEM. gAyakuDE saMgIta darSakuDaitE samakUrE kotta aMdAlavi. ika gAna mAdhuryAnni aMdiMcaTaMlO A reMDu gaLAlu anargaLAlE kadA...

 

click here to hear the song

Important information - Telugu

ఈ పాటను ఘంటసాల, పి.లీల గానం చేయగా ఎన్.టి.ఆర్, రాజసులోచన అభినయించారు. సాహిత్యపరంగా సముద్రాల సీనియర్ కొత్త పోకడలు పోయారీ గీతంలో. మనసులో అనుకున్నదంతా ఓవైపు తెలియజేస్తూనే మరోవైపు 'ఆదమరచి ఎపుడైనా అన్నానా',  'మాట వరస కెపుడైనా అన్నానా' అని చిలిపిగా తప్పించుకుంటూ ఎదుటివారిని ఆటపట్టించుకోవడం వంటి ప్రక్రియ ప్రేమికుల మధ్య చాలా ఆకర్షణీయంగా, తమాషాగా ఉంటుంది. ఆ స్పందనను సమతూకంతో అందించటంలో సముద్రాల - సీనియర్నని అనిపించుకున్నారు. సంగీత దర్శకునిగా ఘంటసాల ఈ పాటను స్వరపరచిన తీరు ప్రత్యేకించి పేర్కొనదగినది.

1948లో మద్రాసు వచ్చి కచ్చేరీ ఇచ్చిన ఉత్తరాది విద్వాంసుడు బడే గులాం ఆలీఖాన్ ప్రభావం ఘంటసాలపై ఎంతగానో ఉందని 'చంద్రహారం' చిత్రంలోని 'ఇది నా చెలి' పాట విశ్లేషణలో ప్రస్తావించడం జరిగింది. బడేగులాం ఆలీఖాన్ ప్రేరణగా హిందూస్థానీ సంగీతం నుంచి తీసుకున్న రాగేశ్వరి రాగంతో ఘంటసాల ఎంతగా ప్రభావితులయ్యారో మరోసారి చెబుతుందీ 'అన్నానా భామిని' పాట. విరామాలు పాటలో ఉంటే మనసుకి రిలీఫ్ ఎంత చక్కగా లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ పాటను వింటే చాలు. మాట వరుసకెపుడైనా అన్నానా, ఆదమరచి ఎపుడైనా అన్నాన్నా వాక్యాల వద్ద లయని పూర్తిగా ఆపేసి డైలాగ్ ఫార్మ్లో ఆ లైన్లని రాగయుక్తంగా పలికించటంలో రసోత్పత్తి ఎంతగా పండిందో అనుభవైకవేద్యమే తప్ప వర్ణించలేం. గాయకుడే సంగీత దర్శకుడైతే సమకూరే కొత్త అందాలవి. ఇక గాన మాధుర్యాన్ని అందించటంలో ఆ రెండు గళాలు అనర్గళాలే కదా...

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి