This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rojulu-marayi-
Song » Chirunavvulu Veeche / చిరునవ్వులు వీచే
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu GaMTasAla, jikki, kRuShNakumAri pADagA akkinEni nAgESvararAvu, ShAvukAru jAnaki, ammAjI aBinayiMcAru. sOggADu, yavvanaM kATEsiMdi, rikShArAjI citrAlalO hIrOyingAnu, prastutaM TIvI raMgaMlO kyArekTar naTigAnu prEkShakulaku telisina jayacitraku I ammAjI talli.


mAsTar vENu macilIpaTnaMki ceMdinavADu kAvaTaM cEta baMdarulO appaTlO maMcipEru teccukunna kRuShNakumArini gAyanigA I pATakOsaM tIsukocci pADiMcArani, A taruvAta Ame sinIgItAlu peddagA pADalEdani 'rOjulu mArAyi' citrAniki proDakShan vyavahArAlu cUsina tammAreDDi kRuShNamUrti telipAru.

ika pATa viShayAnikostE - dES rAgAnni pradhAna rAgaMgA tIsukuni madhya madhya bRuMdAvana sAraMga rAgaM kUDA anipiMcETTugA svaraparicArIpATani. aByudayavAdulu tIsina citraM kanuka saradAgA pADukunE iTuvaMTi - annA vadinA celli kalisi pADukunE - pATalO kUDA dESAniki saMbaMdhiMcina prasakti uMDaTAnni mUDava caraNaMlO gamaniMcavaccu.
Important information - Telugu

 ఈ పాటను ఘంటసాల, జిక్కి, కృష్ణకుమారి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, అమ్మాజీ అభినయించారు. సోగ్గాడు, యవ్వనం కాటేసింది, రిక్షారాజీ చిత్రాలలో హీరోయిన్గాను, ప్రస్తుతం టీవీ రంగంలో క్యారెక్టర్ నటిగాను ప్రేక్షకులకు తెలిసిన జయచిత్రకు ఈ అమ్మాజీ తల్లి.


మాస్టర్ వేణు మచిలీపట్నంకి చెందినవాడు కావటం చేత బందరులో అప్పట్లో మంచిపేరు తెచ్చుకున్న కృష్ణకుమారిని గాయనిగా ఈ పాటకోసం తీసుకొచ్చి పాడించారని, ఆ తరువాత ఆమె సినీగీతాలు పెద్దగా పాడలేదని 'రోజులు మారాయి' చిత్రానికి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి తెలిపారు.

ఇక పాట విషయానికొస్తే - దేశ్ రాగాన్ని ప్రధాన రాగంగా తీసుకుని మధ్య మధ్య బృందావన సారంగ రాగం కూడా అనిపించేట్టుగా స్వరపరిచారీపాటని. అభ్యుదయవాదులు తీసిన చిత్రం కనుక సరదాగా పాడుకునే ఇటువంటి - అన్నా వదినా చెల్లి కలిసి పాడుకునే - పాటలో కూడా దేశానికి సంబంధించిన ప్రసక్తి ఉండటాన్ని మూడవ చరణంలో గమనించవచ్చు.