Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
karNATaka saMgItAniki sabaMdhiMcina SAstrIyaparamaina svaraj~jAnaM kAvalasinaMta unnAsarE aTu pASyAtyatya saMgItamannA iTu hiMdUsthAnI saMgItamannA Ti.vi.rAjugAriki paMcaprANAlu. aMdukE Ayana pATallO I mUDu dhOraNulu elA kAvAlaMTE alA AkramiMcukuMTU uMTAyi. okkOsAri kEvalaM toMgicUstU mAtramE uMTAyi. kAvAlaMTE 'vannela cinnela nerA' pATa pallavilOni sAhityAnni pakkana peTTEsi laiTgA AlapiMcukuni cUDaMDi. aMdulO svadESIyata takkuvagA unnaTTanipistuMdi. idilA uMDagA pATa mottaM havAyin giTAr upayOgiMcina tIru gamanistE hRudayAniki daggaragA uMDE nALAlani taMtrulugA cEsukuni mITErA annaMta jaladariMpu kalugutU uMTuMdi. I pATallO marO pratyEkata kUDA uMdi. adi GaMTasAla, lIla kaMThasvarAlalOni mAdhuryAnni cikkagA cEsi piMDukunnapaddhati, caraNaM tarvAta vaccE anupallavilO 'jANavu nA hRudi nA rANivi nIvE' ani GaMTasAla aMTuMTE pi.lIla adE varasani ham cEyaTaM ivannI pATani UhiMcani ettulaki tIsuku veLatAyi. I pATani en.Ti.Ar, aMjalIdEvipai citrIkariMcAru.
pUrvapu rOjullO mATalu - pATalu okarE rAyaTaM valla kathalO imiDE pATalu, kathatO saMbaMdhaM uMDE pATalu vaccEvanaDAniki I citraMlOni pATalni kUDA ceppukOvaccu. 'nIvani nEnani' pATalO 'kAdanukoMdu kaLA nI muMdu' (pAtrapEru kaLAvati) oka udAharaNa ayitE 'vannela cinnela nerA' pATa mottaM aMtA marO udAharaNa. strI vyAmOhaparuDaina kathAnAyakuDu tana BAryaku (kUDA) oka sannivESaMlO kannugITutADu. A tarvAta vaccE I pATalO A caryaki AScaryapOyina kathAnAyaka manOBAvAlu modaTi caraNaMlO prataPalistU uMTAyi. 'ivannI manaku mAmulE' aMTU tElikagA tIsukunE kathAnAyakuni vyasana manastatvaM reMDO caraNaMlO pratibiMbistU uMTuMdi. aMdukE I pATalu viMTuMTE InATikI manaku mottaM katha gurtukoccEstU uMTuMdi. nijAniki pATala prayOjanaM kUDA cAlAvaraku adE.
కర్ణాటక సంగీతానికి సబంధించిన శాస్త్రీయపరమైన స్వరజ్ఞానం కావలసినంత ఉన్నాసరే అటు పాశ్యాత్యత్య సంగీతమన్నా ఇటు హిందూస్థానీ సంగీతమన్నా టి.వి.రాజుగారికి పంచప్రాణాలు. అందుకే ఆయన పాటల్లో ఈ మూడు ధోరణులు ఎలా కావాలంటే అలా ఆక్రమించుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి కేవలం తొంగిచూస్తూ మాత్రమే ఉంటాయి. కావాలంటే 'వన్నెల చిన్నెల నెరా' పాట పల్లవిలోని సాహిత్యాన్ని పక్కన పెట్టేసి లైట్‌గా ఆలపించుకుని చూడండి. అందులో స్వదేశీయత తక్కువగా ఉన్నట్టనిపిస్తుంది. ఇదిలా ఉండగా పాట మొత్తం హవాయిన్ గిటార్ ఉపయోగించిన తీరు గమనిస్తే హృదయానికి దగ్గరగా ఉండే నాళాలని తంత్రులుగా చేసుకుని మీటేరా అన్నంత జలదరింపు కలుగుతూ ఉంటుంది. ఈ పాటల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఘంటసాల, లీల కంఠస్వరాలలోని మాధుర్యాన్ని చిక్కగా చేసి పిండుకున్నపద్ధతి, చరణం తర్వాత వచ్చే అనుపల్లవిలో 'జాణవు నా హృది నా రాణివి నీవే' అని ఘంటసాల అంటుంటే పి.లీల అదే వరసని హమ్ చేయటం ఇవన్నీ పాటని ఊహించని ఎత్తులకి తీసుకు వెళతాయి. ఈ పాటని ఎన్.టి.ఆర్, అంజలీదేవిపై చిత్రీకరించారు.
పూర్వపు రోజుల్లో మాటలు - పాటలు ఒకరే రాయటం వల్ల కథలో ఇమిడే పాటలు, కథతో సంబంధం ఉండే పాటలు వచ్చేవనడానికి ఈ చిత్రంలోని పాటల్ని కూడా చెప్పుకోవచ్చు. 'నీవని నేనని' పాటలో 'కాదనుకొందు కళా నీ ముందు' (పాత్రపేరు కళావతి) ఒక ఉదాహరణ అయితే 'వన్నెల చిన్నెల నెరా' పాట మొత్తం అంతా మరో ఉదాహరణ. స్త్రీ వ్యామోహపరుడైన కథానాయకుడు తన భార్యకు (కూడా) ఒక సన్నివేశంలో కన్నుగీటుతాడు. ఆ తర్వాత వచ్చే ఈ పాటలో ఆ చర్యకి ఆశ్చర్యపోయిన కథానాయక మనోభావాలు మొదటి చరణంలో ప్రతఫలిస్తూ ఉంటాయి. 'ఇవన్నీ మనకు మాములే' అంటూ తేలికగా తీసుకునే కథానాయకుని వ్యసన మనస్తత్వం రెండో చరణంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే ఈ పాటలు వింటుంటే ఈనాటికీ మనకు మొత్తం కథ గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. నిజానికి పాటల ప్రయోజనం కూడా చాలావరకు అదే.