Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATa mOhanarAgaMlO svaraparacabaDiMdi. ivALTikI mOhanarAgAniki prAmANikaMgA O sinimA pATa ceppu ani aDigitE cAlAmaMdi udahariMcE pATayidE! I pATanu akkinEni nAgESvararAvu, sAvitri paina mAtramE kAkuMDA saMdhya (rukmiNi)ni naukA vihArAniki tIsukuveLi#0C4D;La 'rasapaTTulO tarkaM kUDadu' vaMTi mahattaramaina mATani palikina en.Ti.Ar (SrIkRuShNuDu) painA, 'kAlamahima kAdu prakRuti mahima' aMTU CAyAdEvi (rEvati)ni naukA vihArAniki purigolpi gummaDi (balarAmuDu) painA citrIkariMcArI pATani. I pATalO marO pratyEkata vennela....! nijamaina vennela ilAgE uMTuMdA anipiMcETaMtagA, asalu vennela aMTE 'lAhiri lAhiri' pATalO vennelEnani udahariMcETTugA citrIkariMcina mArkas bArTlI panitanAnni pErkoni tIrAli. aMdukE ippaTikI AMdhrapradESlOni konni prAMtAlalO 'vijayavAri vennela' ani kUDA aMTuMTAru.
ఈ పాట మోహనరాగంలో స్వరపరచబడింది. ఇవాళ్టికీ మోహనరాగానికి ప్రామాణికంగా ఓ సినిమా పాట చెప్పు అని అడిగితే చాలామంది ఉదహరించే పాటయిదే! ఈ పాటను అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి పైన మాత్రమే కాకుండా సంధ్య (రుక్మిణి)ని నౌకా విహారానికి తీసుకువెళి్ళ 'రసపట్టులో తర్కం కూడదు' వంటి మహత్తరమైన మాటని పలికిన ఎన్.టి.ఆర్ (శ్రీకృష్ణుడు) పైనా, 'కాలమహిమ కాదు ప్రకృతి మహిమ' అంటూ ఛాయాదేవి (రేవతి)ని నౌకా విహారానికి పురిగొల్పి గుమ్మడి (బలరాముడు) పైనా చిత్రీకరించారీ పాటని. ఈ పాటలో మరో ప్రత్యేకత వెన్నెల....! నిజమైన వెన్నెల ఇలాగే ఉంటుందా అనిపించేటంతగా, అసలు వెన్నెల అంటే 'లాహిరి లాహిరి' పాటలో వెన్నెలేనని ఉదహరించేట్టుగా చిత్రీకరించిన మార్కస్ బార్ట్లీ పనితనాన్ని పేర్కొని తీరాలి. అందుకే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో 'విజయవారి వెన్నెల' అని కూడా అంటుంటారు.