This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Daya Cheyandi / దయ చేయండీ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu PalAnA PalAnA vAru pADArani gAni, PalAnA PalAnAvAru naTiMcArani gAni viDiviDigA pErkonaTaM kaShTaM.  ayinA GaMTasAla, mAdhavapeddi satyaM, lIla, suSIla kaMThAlu pramuKaMgA vinipistAyi. ika naTInaTulaMTArA adaMtA O  kaurava sEna...! saMgItaM sAhityaM pOTIpaDi samatUkaMlO tUgina pATalalO idokaTi. asalu prayOgAnni 'pATa' ani  anakUDadu. 'BAvarAga saMpuTi' anAli.
 
I prayOgaMlOni modaTi reMDu caraNAlalO praSaMsa venuka toMgi cUsE vyaMgyaM O pratyEkata! ika...kirITAlaku  SirOdhAryamulu. SirOjarakShalu ani, hArAlaku aMdAlaku anubaMdhAlani, cIralaku saMtOShAlaku saMbaMdhAlani, pAda  rakShalaku nATya SikShaNalani varNiMcaTaM ivannI piMgaLi vAri naipuNyaM - teluguvAriki puNyaM! harikAMBOji rAgasvarAla  mIdanE I svara racana ekkuvagA naDicinaTlu kanipistuMdi. ekkuvamaMdi gAyanI gAyakulu pADETappuDu, gAtra dharmAnni  baTTi vAkyAlanu paMcukOvaTaM lEdA paMci ivvaTaM O pratyEkamaina kaLa!
 
A kaLa I pATalO spuTaMgA kanipistOMdi. eMdukaMTE GaMTasAla vAri kaMThaMlO paruShAlu, saraLAlu, anunAsikAlu  modalainavannI tagina rasaspaMdanatO palukutAyi. mAdhavapeddi vAri kaMThaMlO paruShAlu mahAdButaMgA palukutAyi.  aMduku udAharaNa - toDigina tODanE tOdhimi tOdhimi - ani GaMTasAla vAraMTE - aDugu vEyaganE taitaka taitakka - ani  mAdhavapeddi vAri cEta palikiMcaTaM valla avi eMta bAgA paMDAyO SrOtalaku anuBavaika vEdyamE!
 
Important information - Telugu

ఈ పాటను ఫలానా ఫలానా వారు పాడారని గాని, ఫలానా ఫలానావారు నటించారని గాని విడివిడిగా పేర్కొనటం కష్టం. అయినా ఘంటసాల, మాధవపెద్ది సత్యం, లీల, సుశీల కంఠాలు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇక నటీనటులంటారా అదంతా ఓ కౌరవ సేన...! సంగీతం సాహిత్యం పోటీపడి సమతూకంలో తూగిన పాటలలో ఇదొకటి. అసలు ప్రయోగాన్ని 'పాట' అని అనకూడదు. 'భావరాగ సంపుటి' అనాలి.

ఈ ప్రయోగంలోని మొదటి రెండు చరణాలలో ప్రశంస వెనుక తొంగి చూసే వ్యంగ్యం ఓ ప్రత్యేకత! ఇక...కిరీటాలకు శిరోధార్యములు. శిరోజరక్షలు అని, హారాలకు అందాలకు అనుబంధాలని, చీరలకు సంతోషాలకు సంబంధాలని, పాద రక్షలకు నాట్య శిక్షణలని వర్ణించటం ఇవన్నీ పింగళి వారి నైపుణ్యం - తెలుగువారికి పుణ్యం! హరికాంభోజి రాగస్వరాల మీదనే ఈ స్వర రచన ఎక్కువగా నడిచినట్లు కనిపిస్తుంది. ఎక్కువమంది గాయనీ గాయకులు పాడేటప్పుడు, గాత్ర ధర్మాన్ని బట్టి వాక్యాలను పంచుకోవటం లేదా పంచి ఇవ్వటం ఓ ప్రత్యేకమైన కళ!

 ఆ కళ ఈ పాటలో స్పుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఘంటసాల వారి కంఠంలో పరుషాలు, సరళాలు, అనునాసికాలు మొదలైనవన్నీ తగిన రసస్పందనతో పలుకుతాయి. మాధవపెద్ది వారి కంఠంలో పరుషాలు మహాద్భుతంగా పలుకుతాయి. అందుకు ఉదాహరణ - తొడిగిన తోడనే తోధిమి తోధిమి - అని ఘంటసాల వారంటే - అడుగు వేయగనే తైతక తైతక్క - అని మాధవపెద్ది వారి చేత పలికించటం వల్ల అవి ఎంత బాగా పండాయో శ్రోతలకు అనుభవైక వేద్యమే!