This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jayam-Manade
Song » Vastundoy Vastundi / వస్తుందోయ్ వస్తుంది
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 aByudayAniki addaM paTTE 'vastuMdOy vastuMdi' pATa - goMtulO ninAdaMlA ragilE  AvESAniki, guMDellOni nAdaMlA dhvaniMcE caitanyAniki madhyagala vyatyAsAnni kShIranIra nyAyaMlA vEru cEsi cUpi - vicakShaNaku kAvalasina spaMdananu spaShTaMgA aMdiMcagala gItaM. madhyamAvati rAgaMlO svaraparacabaDina I pATanu GaMTasAla, jikki pADagA, nRutyabRuMdaMtO rElaMgi aBinayiMcAru. 'rOjulu mArAyi' citraMlOni 'EruvAka sAgArO rannO cinnanna' pATa naDaka I pATalO koddigA kanipiMcinA A praBAvaM I pATa svaBAvaMtO pUrtigA odigipOyiMdi.


I pATalOni 'tuPAnu rUpai dhUmudhUmudhAmulatO', 'garBadaridrulanuddariMcuTaku', anE vAkyAlu viMTunnappuDu 'guMDamma katha' citraMlOni 'lEciMdi nidralEciMdi' pATalOni 'ippuDE cebutA yinukO bullemmA' anE vAkyaM TyUn paraMgA gurtuku vastuMdi. aMtEkAdu I pATani ivALa maLLI vini avagAhana cEsukOgaligitE 'bIc aMD meloDI vit lirikal byUTI' aMTE EmiTO arthaM avutuMdi. I pATa racana kUDA kosarAjE.
Important information - Telugu

 అభ్యుదయానికి అద్దం పట్టే 'వస్తుందోయ్ వస్తుంది' పాట - గొంతులో నినాదంలా రగిలే  ఆవేశానికి, గుండెల్లోని నాదంలా ధ్వనించే చైతన్యానికి మధ్యగల వ్యత్యాసాన్ని క్షీరనీర న్యాయంలా వేరు చేసి చూపి - విచక్షణకు కావలసిన స్పందనను స్పష్టంగా అందించగల గీతం. మధ్యమావతి రాగంలో స్వరపరచబడిన ఈ పాటను ఘంటసాల, జిక్కి పాడగా, నృత్యబృందంతో రేలంగి అభినయించారు. 'రోజులు మారాయి' చిత్రంలోని 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' పాట నడక ఈ పాటలో కొద్దిగా కనిపించినా ఆ ప్రభావం ఈ పాట స్వభావంతో పూర్తిగా ఒదిగిపోయింది.

ఈ పాటలోని 'తుఫాను రూపై ధూముధూముధాములతో', 'గర్భదరిద్రులనుద్దరించుటకు', అనే వాక్యాలు వింటున్నప్పుడు 'గుండమ్మ కథ' చిత్రంలోని 'లేచింది నిద్రలేచింది' పాటలోని 'ఇప్పుడే చెబుతా యినుకో బుల్లెమ్మా' అనే వాక్యం ట్యూన్ పరంగా గుర్తుకు వస్తుంది. అంతేకాదు ఈ పాటని ఇవాళ మళ్ళీ విని అవగాహన చేసుకోగలిగితే 'బీచ్ అండ్ మెలొడీ విత్ లిరికల్ బ్యూటీ' అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఈ పాట రచన కూడా కొసరాజే.