Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla lIla pADagA en.Ti.Ar, jamuna aBinayiMcAru. sAhityaparaMgA cUstE pATa niMDA kanipiMcEdi telugutanaM- telugu dhanaM! cilikiMta ciguru, guvvakannu raika, pairagAli, rimarima, Usu, doMtara ilA ennO muripiMcE padAla...! cinnAri buggamIda cilipi siggulu dirisena pUvu mIda cilikE muggullA unnAyaTa.... muggulu cilakaTaM... eMta BAvukata...'sAhO rAmakRuShNa SAstri' ani takkina kavulu UrikE annArA!? ika TyUn paraMgA cUsukuMTE pallavi lOni spIDuki buDibuDi gaMtulu vEsE kuMdElu pilla gamanaM, caraNAlalO hAyigA tIsukunE TEkAPki slOmOShanlO parugeDutunna lEDi pillala parugu I reMDU kaLLamuMdu kanipistunnaTTu uMTuMdi. tarvAti rOjullO GaMTasAla iTuvaMTi pATa marokaTi ceyyalEdEmOnani kUDA anipistU uMTuMdi.
ఈ పాటను ఘంటసాల లీల పాడగా ఎన్.టి.ఆర్, జమున అభినయించారు. సాహిత్యపరంగా చూస్తే పాట నిండా కనిపించేది తెలుగుతనం- తెలుగు ధనం! చిలికింత చిగురు, గువ్వకన్ను రైక, పైరగాలి, రిమరిమ, ఊసు, దొంతర ఇలా ఎన్నో మురిపించే పదాల...! చిన్నారి బుగ్గమీద చిలిపి సిగ్గులు దిరిసెన పూవు మీద చిలికే ముగ్గుల్లా ఉన్నాయట.... ముగ్గులు చిలకటం... ఎంత భావుకత...'సాహో రామకృష్ణ శాస్త్రి' అని తక్కిన కవులు ఊరికే అన్నారా!? ఇక ట్యూన్ పరంగా చూసుకుంటే పల్లవి లోని స్పీడుకి బుడిబుడి గంతులు వేసే కుందేలు పిల్ల గమనం, చరణాలలో హాయిగా తీసుకునే టేకాఫ్కి స్లోమోషన్లో పరుగెడుతున్న లేడి పిల్లల పరుగు ఈ రెండూ కళ్ళముందు కనిపిస్తున్నట్టు ఉంటుంది. తర్వాతి రోజుల్లో ఘంటసాల ఇటువంటి పాట మరొకటి చెయ్యలేదేమోనని కూడా అనిపిస్తూ ఉంటుంది.