Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Aswathama / అశ్వత్థామ ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
ఈ పాటను ఘంటసాల పాడగా ఎన్.టి.రామారావు, అంజలీదేవి అభినయించారు. మధ్యమావతి రాగంలోని మాధుర్యాన్నంతా పిండి మరీ తయారు చేసారనిపిస్తుందీ పాటను వింటుంటే! ఈ పాటను అప్పుడు ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు విన్నా ఒకే రకం రసస్పర్శ కలుగుతుంది. అందుకు కారణం అశ్వత్ధామ ట్యూన్ మాత్రమే కాదు ఘంటసాల పాడిన పద్ధతి కూడా! ముఖ్యంగా 'నానా...' అంటూ ఆయన పలికిన ప్రతిసారీ - మార్ధవంగా మాధుర్యంతో ఇన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్ తో పాడొచ్చా అని మ్యూజిక్ ఇయర్ ఉన్న ప్రతివారికీ అనిపించి తీరుతుంది. మొదటి చరణంలో 'ఉసుకోమంటే...' అంటూ ఘంటసాల ఎత్తుకోగానే 'ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా' (లేచింది నిద్ర లేచింది - గుండమ్మ కధ) అనే లైను శ్రోతలకు గుర్తొస్తే వారికి చక్కని 'శ్రుతపాండిత్యం ' ఉన్నట్లనుకోవాలంతే!
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ