Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Aswathama / అశ్వత్థామ ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
ఈ పాటను జిక్కి పాడగా దేవిక (ప్రమీల) పై చిత్రీకరించారు. 'లోకంలో కన్నెలకు లోపాలెన్నే చిన్నది / మారుని జవరాలికైనా (రతీదేవికైన) వంకలు దిద్దే వన్నెది ' అనే వాక్యాలు మల్లాది వారు అద్దిన జిలుగులు. ఈ పాట మోహనరాగం ఆధారంగా స్వరపరచబడింది. ఈ రాగం పోకడ తెలిసినవారికి, పాటలోని పోకడ తెలిసిన వారికి పాటలోని - 'బంగారు పాప ' అనే మాట నుంచి 'ఎవరో ఏలే వారెవరో కలలేలేవారెవరో' అనే వాక్యాల ద్వారా స్వరపరంగా తీసుకున్న అందమైన మలుపులు అశ్వత్ధామ సామర్ధ్యానికి గీటురాళ్ళుగా నిలబడతాయి. దొరికితే ఈ పాటను సంపాదించి వినండి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుందో లేదో మీకు మీరే బేరీజు వేసుకుని చూడండి.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ