Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
suSIla pADina I jAvaLiki tODayina vahIdA rehamAn nRutyABiyAnni InATikI maracipOni vArunnAru. A rOjullO skULLallO, kAlEjIllO EdainA SAstrIya nRutyaMlA aBinayiMcAlsi vastE I pATanu sAdhana cEsi pradarSiMcina saMGaTanalu kUDA konni konni kuTuMbAlalO unnAyi. aMtaTi AdaraNaku gauravAniki nOcukunna I jAvaLini bEgaDa rAgaMlO svaraparicAru. bEgaDa rAgaMlO sinimA pATalEmunnAyani praSniMcukuMTE ivALTikI samAdhAnaM kOsaM cAlA kaShTapaDAlsina paristhitE uMdi. koMtamaMdaitE 'lava-kuSa' citraMlO GaMTasAla svaraparaci gAnaM cEsina 'ide mana ASramaMbu' anE padyAnni mAtramE udaharistAru gAnI eMdukO I jAvaLini gurtu cEsukOru.
సుశీల పాడిన ఈ జావళికి తోడయిన వహీదా రెహమాన్ నృత్యాభియాన్ని ఈనాటికీ మరచిపోని వారున్నారు. ఆ రోజుల్లో స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఏదైనా శాస్త్రీయ నృత్యంలా అభినయించాల్సి వస్తే ఈ పాటను సాధన చేసి ప్రదర్శించిన సంఘటనలు కూడా కొన్ని కొన్ని కుటుంబాలలో ఉన్నాయి. అంతటి ఆదరణకు గౌరవానికి నోచుకున్న ఈ జావళిని బేగడ రాగంలో స్వరపరిచారు. బేగడ రాగంలో సినిమా పాటలేమున్నాయని ప్రశ్నించుకుంటే ఇవాళ్టికీ సమాధానం కోసం చాలా కష్టపడాల్సిన పరిస్థితే ఉంది. కొంతమందైతే 'లవ-కుశ' చిత్రంలో ఘంటసాల స్వరపరచి గానం చేసిన 'ఇదె మన ఆశ్రమంబు' అనే పద్యాన్ని మాత్రమే ఉదహరిస్తారు గానీ ఎందుకో ఈ జావళిని గుర్తు చేసుకోరు.