1950 లో 'దాస్తాన్' అనే హిందీ సినిమా వచ్చింది. రాజ్ కపూర్, సురయ్యా హీరో హీరోయిన్లు. నౌషాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో మహ్మద్ రఫీ (రాజ్ కపూర్ కి), సురయ్యా పాడిన 'తా ర రీ ... తా ర రీ' పాట ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్టు. ఆ పాట పాడుకొనని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇన్ స్పయిర్ కానివాళ్ళు ఆ జనరేషన్ లో లేరనే చెప్పాలి. అంతగా దేశం మొత్తం సంగీతాభిమానుల్ని కుదిపేసిందా పాట. బాలానందం వ్యవస్థాపకులు న్యాపతి రాఘవరావు గారు చాలా ముచ్చటపడ్డారీ పాట విని. అంతేకాదు పిల్లలు పాడుకోవడానికి అనువుగా ఆ ట్యూన్ కి తెలుగులో సాహిత్యాన్ని సమకూర్చుకొని పిల్లలతో పాడించారు. ఆపాటని వినాలంటే పై నున్న మ్యూజిక్ స్టేషన్ దగ్గర క్లిక్ చెయ్యండి. (ఐ ఎ యస్ మోహన్ కందా, బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, చిత్తరంజన్ మొదలైన ప్రముఖులంతా బాలానందం నుంచి వచ్చిన వారేనని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకుంటే న్యాపతి రాఘవరావు గారి మీద గౌరవం మరింత ఎక్కువ అవుతుంది. అన్నట్టు 'మల్లీశ్వరి' (1951) సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పక్కన అల్లసాని పెద్దన గా కనిపించినది న్యాపతి రాఘవరావు గారే). జత పరిచిన యూ ట్యూబ్ లింక్ ద్వారా ఒరిజినల్ హిందీ పాటను చూడొచ్చు.
youtu.be/gxqAe5Z8k0E